logo

  BREAKING NEWS

మేయర్ పీఠాన్ని దక్కించుకోగానే వారిని తరిమికొడతాం .. పాతబస్తీపై బండి సంచల వ్యాఖ్యలు  |   కరోనా సెకండ్ వేవ్: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం!  |   మహిళల భద్రతకు ‘అభయం’ యాప్.. ఎలా పనిచేస్తుంది? ప్రత్యేకతలేమిటి?  |   తెలుగు సినీ పరిశ్రమను కాపాడుకుందాం: కేసీఆర్  |   హైద్రాబాదులో గుంతలు లేని రోడ్డు చూపిస్తే రూ. లక్ష..!  |   భాగ్యనగరవాసులకు అలెర్ట్: ముంచుకొస్తున్న భారీ ముప్పు!  |   జీహెచ్ఎంసీ ఎన్నికలపై పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన..!  |   శత్రుదేశాలకు నిద్రలేకుండా చేసే చైనా రహస్యం.. ‘ఐదు వేళ్ళ వ్యూహం’ గురించి తెలుసా?  |   హైదరాబాద్ పాత బస్తీలో హైటెన్షన్.. భారీగా పోలీసుల బందోబస్తు!  |   జీహెచ్ఎంసీ ఎన్నికలు: టీఆర్ఎస్ రెండో జాబితా విడుదల!  |  

‘మోహన్.. అయిపాయె మన పని.. ప్రాణాల మీద ఆశలు వదులుకో’: అవే చివరి మాటలు

శ్రీశైలం పవర్ ప్లాంట్ లో జరిగిన అగ్ని ప్రమాదం 9 మంది ఉద్యోగుల కుటుంబాల్లో తీరని వేదన మిగిల్చింది. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మృతుల్లో ఒక డీఈఈ, ఆరుగురు ఏఈలు, ఇద్దరు అమర్ రాజ కంపెనీ ఉద్యోగులు ఉన్నారు. చనిపోతామని తెలిసి కూడా ప్రాణాలకు తెగించి ప్లాంట్ ను కాపాడే ప్రయత్నం చేశారు ఉద్యోగులు. వీరిలో ఏఈ సుందర్ చివరి క్షణంలో భార్యకు ఫోన్ చేసి కుటుంబానికి ధైర్యం చెప్పారు.

తనింక బతకక పోవచ్చని తెలిపాడు. అయితే అదే సమయంలో అతనితో పాటు ఉన్న మరో ఏఈ మోహన్ ఉన్నాడు. వీరిద్దరి మధ్య సంభాషణకు సంబందించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఈ వీడియో రికార్డు చేసిన క్షణాల వ్యవధిలోనే అగ్ని ప్రమాదంలో వీరిద్దరూ మరణించినట్టు తెలుస్తుంది. ప్రమాదాన్ని గుర్తించి మోహన్ సైరన్ మోగించాడు. ”మోహన్.. అయిపాయె మన పని.. ఇగ ప్రాణాల మీద ఆశలు వదులుకో” అంటూ మోహన్ తో వ్యాఖ్యానించాడు. ”అట్లా అంటే ఎట్లా ఆశలు ఉంచుకోవాలి కదా” అంటూ మోహన్ కాపాడటానికి ఎవరో వస్తున్నట్టుగా అన్నాడు.

అప్పటికే విద్యుత్ ప్లాంట్ మొత్తం దట్టమైన పొగతో అలుముకుంది. ”ఇంకా ఆలస్యం చేస్తే మనం బతకలేము ఈరోజుతో మన పని అయిపోయింద”ని సుందర్ చివరి సారిగా మాట్లాడారు. అప్పుడే పక్కనున్న లాండ్ లైన్ ఫోన్ నుంచి భార్యకు ఫోన్ చేసి మాట్లాడినట్టుగా తెలుస్తుంది. చివరి ప్రయత్నంగా అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసారు.

చివరకు మెట్లపైనే సుందర్ మృతదేహాన్ని గుర్తించారు. ఎస్కెప్ ఛానెల్ దగ్గర నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేసిన మరో నలుగురు ఏఈలు ఆ ప్రయత్నాలు ఫలించక అక్కడే మృతి చెందారు. ఈ నెల 20వ తేదీన శ్రీశైలం విద్యుత్ ప్లాంట్ లో రాత్రి 9 గంటల షిఫ్ట్ సమయంలో ఈ అగ్ని ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే.

Related News