డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న ఆదిత్య అల్వాను సోమవారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాలుగు నెలలుగా పోలీసులకు చిక్కకుండా పరారీలో ఉన్న ఆదిత్య ఆళ్వాను చెన్నైలో పోలీసులు గుర్తించారు. ప్రముఖ బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ భార్య ప్రియాంక సోదరుడే ఆదిత్య ఆళ్వా.
లాక్ డౌన్ సమయంలో ఆదిత్య డ్రగ్స్ సరఫరా చేయడమే కాకుండా డ్రగ్ పెడ్లర్లతో సన్నిహితంగా ఉన్నట్టుగా అధరాలు కూడా పోలీసులు సంపాదించారు. ఆనాటి నుంచి అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ నెలలో వివేక్ ఒబెరాయ్ ఇంట్లో కూడా సీసీబీ దాడులు నిర్వహించింది.
శాండల్ వుడ్ డ్రగ్స్ కలకలం దృష్టించిన విషయం తెలిసిందే. గతంలో ఇదే కేసులో ‘బుజ్జిగాడు’ ఫేమ్ సంజనా అరెస్టైన విషయం తెలిసిందే. ఆమె బెయిలును కూడా కోర్టు తిరస్కరించింది. ఆమెతో పాటుగా మరికొందరు రాజకీయ, సినీ ప్రముఖులకు కూడా డ్రగ్స్ కేసులో సీసీబీ నోటీసులు అందించింది.