logo

  BREAKING NEWS

మే 15 లోపు వాట్సాప్ ప్రైవసీ పాలసీని యాక్సెప్ట్ చేయకుంటే ఏమవుతుంది?  |   జ‌గ‌న్ – ష‌ర్మిల మ‌ధ్య విభేదాలు 100 % నిజం.. ఇదే సాక్ష్యం  |   శ‌త్రువులు కూడా ఈ విష‌యంలో జ‌గ‌న్‌ను శ‌భాష్ అంటారు  |   కరోనాను అడ్డుకునే అస్త్రం అదొక్కటే.. శుభవార్త చెప్పిన శాస్త్రవేత్తలు  |   శుభవార్త: తగ్గిన బంగారం ధరలు 16.04.2021 బంగారం, వెండి ధరలు  |   కరోనా తీవ్ర ఇన్ఫెక్షన్ వీరిలోనే ఎక్కువ.. కారణం ఇదే  |   పెరిగిన బంగారం ధరలు 15.04.2021 బంగారం, వెండి ధరలు  |   బ‌జాజ్ చేత‌క్ మ‌ళ్లీ వ‌చ్చేసింది.. ధ‌ర ఎంతో తెలిస్తే ఎగిరి గంతేస్తారు  |   హ‌మ్మ‌య్య‌… ఆ వ్యాక్సిన్‌లు కూడా వ‌చ్చేస్తున్నాయి  |   మీ ఫేస్ బుక్ ఖాతా హ్యాక్ అయ్యిందా? మీ డేటా ఎక్కడైనా లీక్ అయ్యిందా? ఇలా తెలుసుకోండి  |  

ఆధార్ తో పాన్ ఇలా లింక్ చేయండి: ఇదే లాస్ట్ డేట్.. లేకుంటే రూ. 10 వేలు ఫైన్!

మీరు ఇప్పటివరకు ఆధార్ తో ప్యాన్ కార్డును లింక్ చేయలేదా? అయితే వెంటనే చేసేయండి. లేదంటే రూ. 10 వేల ఫైన్ కట్టవలసి రావచ్చు. ఆధార్ తో ప్యాన్ లింక్ చేయడానికి కేంద్రం ఎప్పటికప్పుడు చివరి తేదీని పొడిగిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ తేదీని మార్చి 31 కి మార్చింది. గడువు లోగా ఈ పనిని పూర్తి చేయని చట్టపరమైన చర్యలు తీసుకోనుంది. ఐటీ చట్టంలోని సెక్షన్‌ 272బీ ప్రకారం రద్దైన పాన్‌ కార్డు వాడిన వారికి రూ. 10 వేల జరిమానా విధిస్తామని ఆదాయపు పన్ని శాఖ ప్రకటించింది. అంతే కాదు మీ ప్యాన్ కార్డులను పని చేయనివాటిగా లెక్కిస్తామని తెలిపింది.

ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ ‌139 ప్రకారం 2017 జూలై ఒకటో తేదీకి ముందు కార్డు పొందిన వ్యక్తులు తమ ఆధార్ నంబరును కచ్చితంగా ఆదాయపు పన్ను శాఖ అధికారులకు తెలియజేయవలసి ఉంటుంది. అందుకోసం మార్చి నెలాఖరు వరకు గడువు విధించింది. ఏప్రిల్ 1వ తేదీ తర్వాత ఇలా లింక్ చేయని ఫ్యాన్ కార్డులను రద్దు చేయనుంది. ఫ్యాన్ కార్డు రద్దు చేస్తే ఆ వ్యక్తుల ఆర్థిక లావాదేవీలపై ఆ ప్రభావం పడనుంది. బ్యాంకింగ్, ప్రాపర్టీ అమ్మకాలు, కొనుగోలు, స్టాక్ మార్కెట్ల సంబంధిత వ్యవహారంలో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కునే అవకాశం ఉంది.

ఇక ఇప్పటికే ఎన్నోసార్లు చివరి తేదీని పొడిగించిన ఐటీ శాఖ ఇకపై గడువును పొడిగించే అవకాశం లేదని స్పష్టమవుతుంది. ఇప్పటికీ ఆధార్ తో ప్యాన్ ను లింక్ చేయనివారు చాలా మందే ఉన్నారు. అయితే ఈ ప్రక్రియ చాలా సులభం. ఆధార్ తో లింక్ అయిన మొబైల్ నంబరు నుంచి UIDAIPAN అని టైపు చేసి స్పేస్ ఇచ్చి పాన్ నంబరును ఎంటర్ చేసి 567678 లేదా 56161 నంబర్లకు ఎస్ఎంఎస్ చేయాలి. లేదా ఆదాయపు పన్ను శాఖ వెబ్ సైట్ కు వెళ్లి కూడా చేసుకోవచ్చు. అయితే ఆధార్ ప్యాన్ కార్డుల్లోని మీ పేరు, జండర్, పుట్టిన తేదీ లాంటి వివరాలు ఒకేలా లేకుంటే ఈ రెండింటినీ లింక్ చేయలేరు. అలాంటి వారు ముందుగా ఆధార్, పాన్ లలో ఉన్న తప్పులను సరిచేసుకుని ఆ తర్వాత లింక్ చేయాలి.

Related News