ఊహించిందే జరుగుతుంది. ప్రజా జీవనం కరోనాకు ముందు కరోనా తరువాత అన్నట్టుగా తయారైంది. కరోనా మహమ్మారి నుండి తప్పించుకోవాలంటే లాక్ డౌన్ నిబంధనలకు తలవంచక తప్పట్లేదు జనాలకు. ఎక్కడికెళ్లినా ఎవరికివారు స్వీయ నియంత్రణ పాటించడం అలవాటు చేసుకుంటున్నారు. పొరుగు రాష్ట్రమైన తమిళనాడు ప్రభుత్వం లాక్ డౌన్ విషయంలో కఠినంగానే వ్యవహరిస్తోంది.
తాజాగా తమిళనాడులో జారీ చేసిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ప్రకారం సెలూన్లకు వెళ్లి హెయిర్ కట్ చేయించుకునేవారు తప్పనిసరిగా ఆధార్ కార్డు వివరాలు సమర్పించవలసి ఉంటుంది. ఆధార్ తో పాటుగా ఫోన్ నంబర్, అడ్రస్ వంటి వివరాలను అందజేయవలసి ఉంటుంది. అందుకు కారణం లేకపోలేదు. సెలూన్ కి వచ్చిన వారికీ గాని ఆ దులో పని చేసే వారికిగాని కరోనా సోకితే వారి ద్వారా ఎంత మందికి వచ్చిందనే వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు.
అందుకు కస్టమర్ల వివరాలన్నీ తెలుసుకుంటున్నారు. బ్యూటీ పార్లర్లు, సెలూన్లు తప్పనిసరిగా వినియోగదారుల పట్టికను మెయింటైన్ చేయవలసి ఉంటుంది. అదే విధంగా ఒకరికి వదిన వస్తువులను, టవల్స్ ను మరొకరికి వాడకూడదు. ప్రతి రోజు ఐదు సార్లు షాపును శానిటైజ్ చేయాలి. సిబ్బంది కచ్చితంగా గ్లౌజులు ధరించాలి. ప్రస్తుతం ఈ నిబంధన తమిళనాడుకు పరిమితమైన మిగిలిన రాష్ట్రాలు కూడా అవలంబించనున్నాయి.