logo

  BREAKING NEWS

బ‌జాజ్ చేత‌క్ మ‌ళ్లీ వ‌చ్చేసింది.. ధ‌ర ఎంతో తెలిస్తే ఎగిరి గంతేస్తారు  |   హ‌మ్మ‌య్య‌… ఆ వ్యాక్సిన్‌లు కూడా వ‌చ్చేస్తున్నాయి  |   మీ ఫేస్ బుక్ ఖాతా హ్యాక్ అయ్యిందా? మీ డేటా ఎక్కడైనా లీక్ అయ్యిందా? ఇలా తెలుసుకోండి  |   తగ్గిన బంగారం ధరలు 14.04. 2021 నాటి బంగారం, వెండి ధరలు  |   మళ్ళీ పెరిగిన బంగారం ధరలు 13.04.2021 నాటి బంగారం, వెండి ధరలు  |   శుభవార్త: భారత్ లో మరో వాక్సిన్ కు గ్రీన్ సిగ్నల్!  |   కరోనా సెకండ్ వేవ్: ఎక్కువ మందిలో బయటపడుతున్న లక్షణం ఇదే  |   బ‌ట్ట‌లు లేకుండా అమ్మాయిలు వీడియో కాల్ చేస్తారు టెంప్ట్ అయితే మీ ప‌ని ఖ‌తం  |   హలీమ్ తింటే బరువు పెరుగుతారా?  |   ఆ నాలుగు ప్రాంతాల్లోనే కుంభమేళా ఎందుకు? కోట్ల ఖర్చుతో ఎందుకు నిర్వహిస్తారు?  |  

మార్చి 31 లోపు ఈ పని చేయకుంటే ఉచిత మంచి నీరు కట్!

హైద్రాబాద్ వాసుల కోసం తెలంగాణ ప్రభుత్వం ఉచిత మంచినీటి పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ పథకం కింద ప్రతి ఇంటికి 20 వేల లీటర్ల మంచి నీటిని అందిస్తుంది ప్రభుత్వం. అంటే 20 వేల లీటర్ల లోపు నీటిని వాడేవారు నల్లా బిల్లు చెలించనక్కర్లేదు. అయితే ఈ పథకాన్ని పొందాలంటే మాత్రం అపార్టుమెంట్లలో, ఇళ్లలో ఉండే ప్రతి ఒక్కరు నల్లాలకు మీటర్లు ఏర్పాటు చేసుకోవాలి.

ప్రతి ఫ్లాట్ లో ఉంటున్న వారు తమ ఆధార్ వివరాలను నల్లా కనెక్షన్ నంబరుతో అనుసంధానం చేసుకోవలసి ఉంటుంది. డొమెస్టిక్, స్లమ్ ఏరియాలలో ఉండే వారు 20 వేల లీటర్ల లోపు నీటిని వాడితే మీటర్లు అవసరం లేదు. అయితే జల మండలి సూచించిన ఏజెన్సీల ద్వారానే వాటర్ మీటర్లను ఏర్పాటు చేసుకోవాలి.

అందుకు మార్చి 31 వ తేదీ చివరి తేదీ. లాస్ట్ డేట్ లోపు ఈ ప్రక్రియ పూర్తి చేయని వారికి మంచినీటి పథకం వర్తించదని జలమండలి అధికారులు స్పష్టం చేస్తున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రతి ఫ్లాట్ లో నివసించే వారు నల్లా మీటరు పని చేస్తుందో లేదో చెక్ చేసుకోవాలి. అది పనిచేయడం లేదని గుర్తిస్తే వెంటనే కొత్త మీటరును ఏర్పాటు చేసుకోవాలి.

ఈ మీటరు లేని వారు ఈ పథకానికి అనర్హులు. అదే విధంగా నల్లా కనెక్షన్ తో ఆధార్ కార్డును లింక్ చేసుకోవాలి. వేలిముద్ర కూడా వేయాలి. దీనిని ఎవరికి వారు సులభంగా ఇంటి వద్ద నుంచే ఆన్ లైన్ లో చేసుకునే వెసులుబాటు కల్పించింది జలమండలి. లేదంటే మీ సేవ ద్వారా కూడా చేసుకోవచ్చు.

1. ముందుగా ” www. హైదరాబాద్ వాటర్. జీఓవీ.ఐఎన్” వెబ్ సైట్ ను ఓపెన్ చేయాలి.
2. అందులో నుంచి ఆధార్ ను లింక్ చేసుకునే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
3. అప్పడు తమ అపార్ట్మెంట్ నల్లా కనెక్షన్ కు లింక్ అయ్యి ఉన్న మొబైల్ నంబరుకు ఓటీపీ వస్తుంది.
4. ఇక్కడ ఫ్లాట్ యజమాని పేరు, ప్రాపర్టీ ట్యాక్స్ ఐడెంటికేషన్(పిటిఐఎన్) నంబరు, ఆధార్ నంబర్ ను ఎంటర్ చేయాలి.
5. లింక్ చేసి ఉన్న మొబైల్ నంబరుకు కు ఓటీపీ వస్తుంది.
6. ఈ ఓటీపీని ఎంటర్ చేసినతర్వాత లింక్ చేసే ప్రక్రియ మొదలవుతుంది.
7. అంతా ఒకేసారి కాకుండా ఒక అపార్టుమెంట్లో రోజుకి 10 మంది కలిసి వేర్వేరుగా ఈ ప్రక్రియ పూర్తి చేస్తే తొందరగా పని పూర్తి అవుతుంది.
8. ఈ ప్రక్రియలో ఏవైనా సమస్యలు ఉంటె వారు 155313 నంబర్ లేదా ఫోన్ నంబర్ 040-2343 3933కి కాల్ చేసి కనుక్కోవచ్చు.

 

Related News