దాదాపు ప్రతి పనికి ఆధార్ కార్డు తప్పనిసరి అయిపోయింది. అయితే ఆధార్ కార్డులో ఫోటో బాగా లేదనే అసంతృప్తి ఇప్పటికీ చాలా మందిలో ఉంటుంది. అలాంటి వారు ఆధార్ లో ఫోటోను చాలా సులభంగా మార్చుకోవచ్చు. ఆధార్ కార్డులో పేరు, పుట్టిన తేదీ, అడ్రస్ లాంటి వివరాలను మార్చినట్టే, ఫోటోను కూడా మార్చేయొచ్చు. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా-UIDAI ఆన్లైన్లోనే చాలావరకు వివరాలను అప్డేట్ చేసే అవకాశం కల్పిస్తోంది. అయితే కొన్ని వివరాలు అప్డేట్ చేయాలంటే తప్పనిసరిగా ఆధార్ సెంటర్ లేదా ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లాల్సిందే. మరి ఫోటోను మార్చుకోవడానికి అవసరమయ్యే ప్రాసెస్ ఏమిటో ఇప్పుడు చూద్దాం..
ఆధార్ లో మీ ఫోటోను మార్చుకోవాలనుకుంటే అందుకు రెండు మార్గాలు ఉన్నాయి. మీకు దగ్గరలోని ఆధార్ ఎన్ రోల్ మెంట్ సెంటర్ కు వెళ్లి యుఐడిఎ వెబ్ సైట్ నుంచి ఫార్మ్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి. అందులో పేరు, పుట్టిన తేదీ, అడ్రస్ లాంటి వివరాలన్నీ సరిగ్గా నమోదు చేయాలి. ఆ తర్వాత ఆధార్ కేంద్రం లోని ఎగ్జిక్యూటివ్ మీ లేటెస్ట్ -ఫోటో తీసుకుంటాడు. ఆ తర్వాత మీ బయోమెట్రిక్ వివరాలతో దానిని అప్రూవ్ చేస్తారు. ఫోటో అప్ డేట్ చేయడానికి 25 రూపాయలు ప్లస్ జీఎస్టీ చెలించాల్సి ఉంటుంది. మీ ఫోటో అప్ డేట్ అయిన తర్వాత కొత్త ఆధార్ కార్డును డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
మరోవిధంగా యూఐడీఏఐ రీజినల్ ఆఫీస్కు ఒక లెటర్ రాయడం ద్వారా కూడా ఆధార్ లో ఫోటోను మార్చుకోవచ్చు. అందుకోసం యూఐడీఏఐ వెబ్సైట్ నుంచి ఆధార్ డేటా అప్డేట్ కరెక్షన్ ఫామ్ డౌన్ చేసుకోవాలి. దీన్ని మీ డీటెయిల్స్ ఇచ్చి ఫిల్ చేయాలి. ఒక లెటర్ రాసి, దీనికి ఫామ్ జతచేసి యూఐడీఏఐ రీజినల్ ఆఫీస్కు పంపాలి. వీటితో పాటుగా మీ ఫోటో కాపీ కూడా జతచేయాలి. ఈ ప్రాసెస్ పూర్తి చేసిన 15 నుంచి 20 రోజుల్లో మీ ఇంటికే అప్ డేట్ అయిన కొత్త ఆధార్ కార్డు వస్తుంది.