logo

  BREAKING NEWS

ఓటీటీలో రిలీజైన కేజీఎఫ్: చాప్ట‌ర్‌-2..! కానీ షాకిచ్చిన అమెజాన్ ప్రైమ్‌  |   టాయిలెట్‌లో కెమెరా.. హోంమంత్రికి ఫిర్యాదు  |   కాబోయే భ‌ర్త మృతి.. ఆ యువ‌తి చేసిన ప‌నికి క‌న్నీళ్లు ఆగ‌వు  |   స‌లార్ సినిమాపై కిక్కిచ్చే వార్త‌  |   మ‌హేష్ – రాజ‌మౌళి సినిమాపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన విజ‌యేంద్ర ప్ర‌సాద్‌  |   వంద‌ల ఎక‌రాల భూమి ఉన్న కుటుంబంలో కేసీఆర్ పుట్టారు  |   2022 – 23కు కేంద్రీయ విద్యాల‌య అడ్మిష‌న్లు ప్రారంభం.. పూర్తి వివ‌రాలు  |   నిరుద్యోగుల‌కు భారీ శుభ‌వార్త‌.. రైల్వేలో 2,65,547 ఖాళీలు  |   మ‌రో కొత్త ప‌థ‌కాన్ని ప్రారంభించ‌నున్న జ‌గ‌న్‌.. దేశంలోనే మొద‌టిసారి  |   అండ‌మాన్ ఎన్నిక‌ల్లో మ‌రోసారి స‌త్తా చాటేందుకు చంద్ర‌బాబు స్కెచ్‌  |  

మీ ఆధార్ కార్డు వివరాలను ఎవరికిచ్చారు? ఎక్కడెక్కడ వాడారు? ఇలా తెలుసుకోండి

మన దేశంలో ప్రతి పౌరుడికి ఆధార్ తప్పనిసరి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను వాటి ప్రయోజనాలను పొందాలంటే ఆయా స్కీములను ఆధార్ తో అనుసంధానం చేయాల్సి ఉంటుంది. ఇవే కాకుండా ప్రతి రోజు ఎన్నో అవసరాల కోసం ఆధార్ కార్డును ఉపయోగిస్తుంటాం. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే మన మొబైల్ నంబరుతో ఆధార్ కార్డును లింక్ చేసుకోవాలి.
ఎన్నో అవసరాలకు ఉపయోగించే ఆధార్ ను ఎక్కడెక్కడ ఎందుకోసం ఉపయోగించాలో తెలుసుకోవడం కూడా చాలా అవసరం. మన ఆధార్ ను మన ప్రమేయం లేకుండా ఇతరులు కూడా ఉపయోగించే ప్రమాదం ఉంది. అప్పుడు లేనిపోని చిక్కులు ఎదుర్కోవలసి ఉంటుంది.

ఈ క్రమంలో కొంతమంది అవసరం లేకపోయినా ఆధార్ వివరాలను మన దగ్గరి నుంచి సేకరిస్తుంటారు. ఆ తర్వాత ఆ చోట ఆధార్ వివరాలు ఇవ్వాల్సిన అవసరం లేదని తెలిస్తే ఏమీ చేయలేని పరిస్థితి. అందుకే అవసరం లేని చోట మన ఆధార్ వివరాలను డిలీట్ చేసే విధంగా యూఐడీఏఐ అవకాశం కల్పించింది. యూఐడీఏఐ వెబ్‌సైట్‌కు వెళ్లి ఆధార్ కార్డు వివరాలతో పాటుగా గత ఆరు నెలల వ్యవధిలో ఎక్కడెక్కడ మన ఆధార్ ఉపయోగించామో తెలుసుకోవచ్చు. అలాగే అవసరం లేదనుకుంటే అక్కడి నుంచి మన ఆధార్ వివరాలను డిలేట్ చేసుకోవచ్చు. ఇంటి దగ్గరి నుంచే నిమిషాల వ్యవధిలో ఈ సేవలను ఎలా పొందవచ్చో తెలుసుకోండి..

1. ముందుగా ఆధార్ వెబ్ సైట్ లోకి వెళ్లి ‘మై ఆధార్’ సేవల దగ్గర ‘ఆథెంటికేష‌న్ హిస్ట‌రీ’ పేజ్‌ను ఓపెన్ చేయాలి.

2. అందులో ఆధార్ నంబ‌ర్‌ను ఎంటర్ చేయాలి.

3. అక్కడ చూపిన విధంగా సెక్యూరిటీ కోడ్ ను ఎంటర్ చేయాలి.

4. జనరేట్ ఓటీపీ అనే బటన్ పై క్లిక్ చేయాలి.

5. రిజిస్ట‌ర్డ్ మొబైల్ ఫోన్‌కు ఓటీపీ వ‌స్తుంది.

6. అక్క‌డ క‌నిపించే పేజీలో ఎన్ని లావాదేవీలు చూడాల‌నుకుంటున్నారు, ఎంత వ్య‌వ‌ధిలోని లావాదేవీల‌ను చూడాల‌నుకుంటున్నారు.. అనే వివ‌రాల‌ను తెలియ‌జేయాలి.

7. అనంత‌రం ఓటీపీని ఎంట‌ర్ చేసి స‌బ్‌మిట్ బ‌ట‌న్‌పై క్లిక్ చేయాలి.

8. ఇప్పుడు మీరు మీ ఆధార్ నంబర్‌ను ఎవరెవరికి ఇచ్చిందీ తేదీ, సమయంతో పాటుగా వస్తాయి. వాటిని ప్రింట్ తీసుకోవచ్చు.

9. అవసరం లేని దగ్గర నుంచీ ఆధార్ కార్డ్ వివరాల్ని డిలీట్ చేయించవచ్చు.

మీ ప్రమేయం లేకుండా ఎక్కడైనా మీ ఆధార్ వినియోగించి ఉంటె వెంటనే అతంటికేషన్ యూజర్ ఏజన్సీకి గాని 1947 నంబర్ కు డయల్ చేయడం ద్వారా గాని ఫిర్యాదు చేయవచ్చు.

Related News