logo

  BREAKING NEWS

భూమా అఖిలప్రియ అరెస్టుపై కొడాలినాని సంచలన వ్యాఖ్యలు!  |   సీఎం జగన్ ఆకస్మిక ఢిల్లీ పర్యటన.. మతలబేంటి?  |   ”జీవితకాలం శిక్షపడే కేసులు స్వీకరించం”.. అఖిలప్రియకు కోర్టు భారీ షాక్!  |   బ్రేకింగ్: కన్నీళ్లు పెట్టుకున్న ఎమ్మెల్యే రోజా..!  |   మాజీ మంత్రి అఖిల ప్రియ కేసులో కొత్త మలుపు!  |   నువ్వు దేవుడివి సామీ.. 1020 మంది చిన్నారుల‌కు ప్రాణాలు పోసిన మ‌హేష్  |   ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమానుల‌ను టెన్ష‌న్ పెడుతున్న త్రివిక్ర‌మ్‌  |   తొలి టీకా పై వెనక్కి తగ్గిన ఈటెల.. కారణం ఇదే!  |   తెలుగు రాష్ట్రాల సీఎంలకు కేంద్ర మంత్రి లేఖ.. కీలక ఆదేశాలు!  |   వాక్సిన్ వికటించి 23 మంది మృతి.. మరో 23 మందికి అస్వస్థత!  |  

తెలంగాణ సర్కార్ కొత్త పథకం.. కానీ ఆధార్ కార్డు ఉండాల్సిందే!

హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ఇచ్చిన 20 వేల లీటర్ల ఉచిత నీటి సరఫరా పథకం అమలుకు రంగం సిద్ధమైంది. గ్రేటర్ పరిధిలో ఉచిత నల్లా నీటిని సరఫరా చేసే విధంగా విధంగా మున్సిపల్ పరిపాలనా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్‌ మెట్రో వాటర్‌ వర్క్స్‌ పరిధిలోని జీహెచ్‌ఎంసీ, మునిసిపల్‌ కార్పొరేషన్లు, మునిసిపాలిటీలకు ఈ పథకం వర్తించనుంది. ఈ పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ను సైతం విడుదల చేసింది.

అయితే ఈ ఉచిత మంచి నీటిని పొందాలనుకులే వారు కచ్చితంగా ఆధార్ కార్డులు కలిగి ఉండాలి. లేదంటే ఉచిత నీరు లేనట్టే. ఒక వేళ ఇప్పటివరకు ఆధార్ కార్డు లేకపోతే ఇప్పుడు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ సమయంలో వారు ఇచ్చే రశీదును జాగ్రత్త చేసుకోవాలి. రసీదులో ఉన్న నంబరును చెప్పినా ఈ పథకాన్ని పొందవచ్చు. ఈ విషయాన్ని ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ లో పేర్కొంది. అయితే ఈ పథకం ఎప్పటి నుంచి అమలులోకి వస్తుందనే విషయాన్ని నోటిఫికేషన్ లో పేర్కొనలేదు.

 

Related News