logo

  BREAKING NEWS

రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |   గుడ్‌న్యూస్‌.. క‌రోనా ముక్కు వ్యాక్సిన్ సూప‌ర్‌  |   ఈ కిట్‌తో మ‌న‌మే క‌రోనా టెస్టు చేసుకోవ‌చ్చు.. ధ‌ర ఎంతో తెలుసా ?  |  

టాలీవుడ్ హీరో అడవి శేష్, శ్రీముఖిలకు అరుదైన గౌరవం!

దక్షిణాసియాలోనే అత్యంత స్ఫూర్తిదాయకులైన 400 మంది జాబితాలో తాజాగా మరికొంత మంది తెలుగువారు చోటు సంపాదించుకున్నారు. వారిలో యాంకర్, నటి శ్రీముఖి, టాలీవుడ్ హీరో అడవి శేష్ కూడా ఉన్నారు. వీరితో పాటు మరో నటి ప్రగతి కూడా ఉన్నారు. గతంలో ఈ జాబితాలో మేము కూడా ఉన్నామంటూ రష్మీ గౌతమ్, యాంకర్ ప్రదీప్ మాచిరాజు వెల్లడించిన విషయం తెలిసిందే.

ప్రముఖ సంగీత దర్శకుడు ఏ. ఆర్ రెహమాన్ ఈ లిస్టులో టాప్ లో నిలిచారు. సింగర్ అద్నాన్ సమీ, సోనూ నిగమ్, జాకీర్ హుస్సేన్, రహత్ ఫతే అలీఖాన్ కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. న్యూయార్క్ ప్రెస్ ఏజెన్సీ, బ్రిటిష్ జర్నలిస్ట్ కిరణ్ రాయ్ ఈ జాబితాను వెల్లడించారు.

మొత్తం నాలుగు వందల మందితో జూమ్ మీటింగ్ లో ఇంటర్వ్యూలు నిర్వహించిన అనంతరం ఆమె ఈ పేర్లను ప్రకటించారు. ఆర్ట్స్, మీడియా, కల్చరల్ విభాగాలలోని ప్రముఖులు ఇందుకు ఎంపికయ్యారు. తమ పేరును ప్రకటించడం పై హీరో అడవి శేష్ ఆనందాన్ని వ్యక్తం చేసారు. 2020కి గానూ 400 మోస్ట్‌ ఇన్ల్ఫూయెన్సియల్‌ లిస్ట్‌లో నా పేరును చేర్చినందుకు ధన్యవాదాలు అని తెలిపారు. ఏ ఆర్ రెహమాన్ వంటి పెద్ద పెద్ద ప్రముఖులతో పాటుగా కిరణ్ రాయ్ నన్ను కూడా ఇంటర్వ్యూ చేసారని శేష్ తెలిపారు.

Related News