logo

  BREAKING NEWS

షాకింగ్‌.. భార్య‌ల‌ను అద్దెకు ఇస్తున్నారు  |   కౌశీక్ రెడ్డికి బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఏకంగా డ‌బుల్ ప్ర‌మోష‌న్‌..!  |   తెలంగాణ బీజేపీకి జోష్‌.. త్వ‌ర‌లోనే మాజీ ఎంపీ, కాంగ్రెస్ కీల‌క నేత చేరిక‌  |   రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |  

అమ్మాయే సెక్స్ ఆఫ‌ర్ చేస్తే క్యాస్టింగ్ కౌచ్ కాదు.. న‌టిపై శ్రీరెడ్డి ఫైర్‌‌

టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్ అంశాన్ని లేవ‌నెత్తి వివాదాస్ప‌ద న‌టిగా మారిన శ్రీరెడ్డి సోష‌ల్ మీడియాలో సంచ‌ల‌న, వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేస్తుంటారు. ప్ర‌స్తుతం కోలీవుడ్‌లో బిజీగా ఉన్న శ్రీరెడ్డి టాలీవుడ్‌పైనా ఓ క‌న్నేసి ఉంచుతారు. ఈ నేప‌థ్యంలో ఓ న‌టి, బిగ్ బాస్ 3 కంటెస్టెంట్‌పై శ్రీరెడ్డి ఫేస్‌బుక్‌లో తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. క్యాస్టింగ్ కౌచ్‌పైన వీరిద్ద‌రి మ‌ధ్య వివాదం మొద‌లైంది.

స‌ద‌రు న‌టి ఇటీవ‌ల క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ… ఇది అన్ని రంగాల్లోనూ ఉంటుంద‌ని, క్యాస్టింగ్ కౌచ్‌కు అమ్మాయి ఎలా స్పందించింది అనే దానిపై అంతా ఆధార‌ప‌డి ఉంటుంద‌ని చెప్పారు. అమ్మాయి నో అంటే ఎవ‌రూ ఏమీ చేయ‌లేర‌ని చెప్పారు. ఈ వ్యాఖ్య‌ల‌పై శ్రీరెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. స‌ద‌రు న‌టిని ఉద్దేశించి ఫేస్‌బుక్‌లో.. ఒక అమ్మాయి ప‌ని కోసం వ‌చ్చిన‌ప్పుడు ఎవ‌రైనా శృంగారం కోసం బ‌ల‌వంతం చేస్తే అది క్యాస్టింగ్ కౌచ్ అవుతుంద‌ని చెప్పారు.

అదే ఎవ‌రైనా అమ్మాయి త‌నంత‌ట తానే నిర్మాత‌కు శృంగారాన్ని ఆఫ‌ర్ చేస్తే అది క్యాస్టింగ్ కౌచ్ కింద‌కు రాద‌ని అన్నారు. నీవు నాకు బాగా తెలుసు అనే విష‌యం మ‌రిచిపోకు బుజ్జీ అంటూ స‌ద‌రు న‌టిని ఉద్దేశించి ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టారు శ్రీరెడ్డి. నిజానికి టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్ లేద‌ని ఆ న‌టి ఏమీ చెప్ప‌లేదు. అయినా, శ్రీరెడ్డికి ఎందుకు కోపం వ‌చ్చిందో మ‌రి.

Related News