logo

  BREAKING NEWS

రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |   గుడ్‌న్యూస్‌.. క‌రోనా ముక్కు వ్యాక్సిన్ సూప‌ర్‌  |   ఈ కిట్‌తో మ‌న‌మే క‌రోనా టెస్టు చేసుకోవ‌చ్చు.. ధ‌ర ఎంతో తెలుసా ?  |  

అక్షయ్ కుమార్ పై భానుప్రియ సోదరి సంచలన ఆరోపణలు!

ప్రముఖ బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ పై నటి శాంతి ప్రియ సంచలన ఆరోపణలు చేసారు. ఇటీవల ఓ టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శాంతి ప్రియ మాటాడుతూ.. ఓ సందర్భంలో హీరో అక్షయ్ కుమార్ తన శరీర రంగుపై అనుచిత వ్యాఖ్యలు చేసారంటూ చెప్పుకొచ్చారు. తన శరీర రంగు కారణంగా ఆమె ఎప్పుడు స్కిన్ కలర్ స్టాకింగ్స్ (మేజోళ్ళు)ను ధరించేవారట.

ఓసారి అక్షయ్ కుమార్ తన మోకాళ్ళ పై భాగంలో రంగు చూసి నీకు అక్కడ రక్తం గడ్డ కట్టిందా అని చమత్కారం చేసారు. అక్షయ్ వేసిన జోక్ కు అక్కడున్నవారంతా పగలబడి నవ్వారు. అక్షయ్ సరదాగా చేసిన ఆ కామెంట్లు నాకు చాలా అసౌకర్యంగా అనిపించాయి. అక్కడే గట్టిగా ఏడ్చేసాను. ఆ తర్వాత కూడా నా శరీర రంగు కారణంగా బాలీవుడ్ లో నాకు అవకాశాలు తగ్గిపోయాయి. నేను నటించిన సినిమాలు కూడా ఆడలేదు.

మెల్లిమెల్లిగా నేను బాలీవుడ్ నుండి కనుమరుగయ్యాను. అలా నేను బాలీవుడ్ లో వివక్షకు గురయ్యాను అను చెప్పుకొచ్చారు. కాగా శాంతి ప్రియ చేసిన ఈ కామెంట్లు వైరల్ గా మారడంతో ఆమె మరోసారి ఈ విషయంపై స్పందించాల్సి వచ్చింది. అక్షయ్ నాకు మంచి స్నేహిత్తుడు. మేమిద్దరం ఎంతో సరదాగా ఉంటాం. కానీ ఎదుటివారి శరీర రంగుపై వేసే జోక్స్ వారిని బాధపెడతాయి అని నేను చెప్పాలనుకున్నాను. అంతేగాని అతనిపై ఎలాంటి ఆరోపణలు చేయలేదు అంటూ క్లారిటీ ఇచ్చారు.

కాగా తెలుగులో అగ్ర తారగా వెలుగొందిన భానుప్రియ సోదరి శాంతి ప్రియ. వంశీ దర్శకత్వంలో ‘మహర్షి’ సినిమాలో శాంతిప్రియ నటించి మెప్పించారు. సూపర్ స్టార్ కృష్ణ, నాగార్జున సినిమాల్లో కూడా మెరిశారు. ఆ తరువాత బాలీవుడ్‌కి వెళ్లి అక్షయ్‌ కుమార్‌ హీరోగా ‘సౌగంథ్‌’లో నటించారు. ఈ సమయంలోనే వీరిద్దరూ మంచి స్నేహితులుగా మారారు. ఈ నేపథ్యంలో శాంతి ప్రియ అక్షయ్ పై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

Related News