logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

పెళ్లి పేరుతో విశాల్ నా వెంట పడ్డాడు.. నటి సంచలన వ్యాఖ్యలు

తమిళ హీరో, నటీనటుల సంఘం అధ్యక్షుడు విశాల్ పెళ్లిపై ఇప్పుడు కొత్త వివాదం మొదలైంది. ఓ తమిళ నటి విశాల్ పెళ్లి పై సంచలన వ్యాఖ్యలు చేసింది. విశాల్ రిలేషన్ షిప్ పై వార్తలు ఇప్పుడు కొత్తేమీ కాదు. గతంలో శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మితో విశాల్ రిలేషన్ షిప్ లో ఉన్నాడనే వార్తలు కోలీవుడ్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారని అయితే నడిగర్ సంఘం పదవికి పోటీ చేసే విషయంలో శరత్ కుమార్ థ్ విబేధాల కారణంగా వీరిద్దరో విడిపోయారని టాక్ వినిపించింది.

అయితే మేమిద్దరం మంచి స్నేహితులం మాత్రమే అని విశాల్ ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు. ఇటీవలే హైదరాబాద్ కు చెందిన ఓ బిజినెస్ మ్యాన్ కుమార్తె అనిషా రెడ్డితో విశాల్ నిశ్చితార్ధం కూడా జరిగింది. నిశ్చితార్థం తర్వాత అనిషా ఉన్నట్టుండి వీరిద్దరూ కలిస్ ఉన్న ఫోటోలను సోషల్ మీడియా నుండి తొలగించడంతో విశాల్, అనిషాలు బ్రేక్ అప్ చెప్పుకున్నారని మరోసారి విశాల్ పెళ్లి వార్తల్లో నిలిచింది. తాజాగా ఇప్పుడు తమిళ నటి మీరా మిథున్ విశాల్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది.

విశాల్ తనను పెళ్లి చేసుకోవాలని రెండు మూడేళ్లుగా వెంటపడుతున్నాడని అయితే తనకు ఉన్నత కుటుంబాల నుంచి వచ్చిన వారిని, ఆస్తిపాస్తులు ఉన్నవారిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోవడంతో విశాల్ కు నో చెప్పినట్టుగా ఓ వీడియోలో తెలిపింది. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు విశాల్ అభిమానులను షాక్ కు గురి చేశాయి. ఎందుకంటే మీరా మిథున్ నటిగా అంత సుపరిచితురాలు కాకపోయినా తమిళ స్టార్ హీరోలను టార్గెట్ చేస్తూ ఆమె చేసే వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతుంటాయి.

రజనీకాంత్ మొదలుకుని, విజయ్, అజిత్, త్రిష ఇలా అందరిని ఓ ఆటాడుకుంటుంది. విశాల్ గతంలో ఈమెతో తీసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా అమరుతున్నాయి. ఇప్పుడు మీరా మిథున్ వ్యాఖ్యలపై విశాల్ ఏ విషంగా స్పందిస్తాడో అని అతని అభిమానులతో పాటు అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related News