logo

  BREAKING NEWS

రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |   గుడ్‌న్యూస్‌.. క‌రోనా ముక్కు వ్యాక్సిన్ సూప‌ర్‌  |   ఈ కిట్‌తో మ‌న‌మే క‌రోనా టెస్టు చేసుకోవ‌చ్చు.. ధ‌ర ఎంతో తెలుసా ?  |  

బాలీవుడ్ లో మరో విషాదం.. ‘డర్టీ పిక్చర్’ నటి ఇకలేరు!

బాలీవుడ్ ను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత ఇప్పుడు మరో నటి అనుమానాస్పద రీతిలో మృతి చెంది కనిపించారు. నటి ఆర్య బెనర్జీ తన అపార్టుమెంటులో ఆత్మహత్య చేసుకుని మృతి చెంది ఉంటారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆర్య బెనర్జీ విద్యా బాలన్, హిమేష్ రేష్మి తో కలిసి ‘డర్టీ పిక్చర్’ లో నటించారు.

‘లవ్ సెక్స్ ఆర్ ధోకా’ , ‘ఎల్ సి డి’ సినిమాలతో పాటుగా మోడలింగ్ రంగంలో కూడా రాణించారు. కాగా గత కొంత కాలంగా ఆమె ఒంటరిగానే ఉంటున్నారని ఇంటి పనిమనిషి పోలీసులకు వెల్లడించారు. దీంతో ఆమె మరణానికి కారణం డిప్రెషనా లేక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

కోల్‌కతా నగరంలోని జోధ్ పూర్ కు సమీపంలో ఆమె నివసిస్తున్నారు. ఇటీవల పని మనిషి డోర్ బెల్ కొట్టగా తీయకపోవడంతో ఆమె పక్క ఫ్లాట్ వారికి సమాచారం అందించింది. వారు ఫోన్ చేసినా తీయకపోవడంతో వెంటనే పోలీసులను ఆశ్రయించారు. తలుపులు తెరిచి చూడగా ఆమె రక్తపు మడుగులో పడి ఉన్నారు. కాగా ఆమె మృతికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Related News