logo

  BREAKING NEWS

షాకింగ్‌.. భార్య‌ల‌ను అద్దెకు ఇస్తున్నారు  |   కౌశీక్ రెడ్డికి బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఏకంగా డ‌బుల్ ప్ర‌మోష‌న్‌..!  |   తెలంగాణ బీజేపీకి జోష్‌.. త్వ‌ర‌లోనే మాజీ ఎంపీ, కాంగ్రెస్ కీల‌క నేత చేరిక‌  |   రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |  

బ్రేకింగ్: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో త‌గ్గుతున్న క‌రోనా యాక్టీవ్ కేసులు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కొత్త‌గా న‌మోద‌వుతున్న క‌రోనా పాజిటీవ్ కేసుల సంఖ్య క్ర‌మంగా త‌గ్గుతోంది. గ‌త 24 గంట‌ల్లో రాష్ట్రంలో మొత్తం 10,730 శాంపిల్స్‌ను ప‌రీక్షించ‌గా 33 మందికి క‌రోనా పాజిటీవ్‌గా తేలింది. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు న‌మోదైన క‌రోపా పాజిటీవ్ కేసుల సంఖ్య 2,051కి చేరింది. వీరిలో 1,056 మంది పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ కాగా 949 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. 46 మంది ఇప్ప‌టి వ‌ర‌కు క‌ర‌నాతో మ‌ర‌ణించారు. గ‌త 24 గంట‌ల్లో 58 మంది పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.

గ‌త 24 మందిలో చిత్తూరు జిల్లాలో 10, క‌ర్నూలు జిల్లాలో 9, నెల్లూరు జిల్లాలో 9, కృష్ణా జిల్లాలో 4, తూర్పు గోదావ‌రి జిల్లాలో 1 పాజిటీవ్ కేసు న‌మోదైంది. మిగ‌తా ఎనిమిది జిల్లాల్లో ఎటువంటి పాజిటీవ్ కేసులు న‌మోదు కాలేదు. 24 గంట‌ల్లో న‌మోదైన 33 కేసుల్లో చిత్తూరు జిల్లాలో న‌మోదైన 10, నెల్లూరులో న‌మోదైన 9, తూర్పు గోదావ‌రి జిల్లాలో న‌మోదైన ఒక కేసు చెన్నైలోని కోయంబేడు నుంచి వ‌చ్చిన‌వి.

ఇప్ప‌టివ‌ర‌కు రాష్ట్రంలో క‌ర్నూలులో 584, గుంటూరులో 387, కృష్ణాలో 346, చిత్తూరులో 131, అనంత‌పురంలో 115, నెల్లూరులో 111, క‌డ‌ప జిల్లాలో 97, ప‌శ్చిమ గోదావ‌రిలో 68, విశాఖ‌ప‌ట్నంలో 66, ప్ర‌కాశంలో 63, తూర్పు గోదావ‌రిలో 47, శ్రీకాకుళంలో 5, విజ‌య‌న‌గ‌రంలో 4, ఇత‌ర రాష్ట్రాల నుంచి వ‌చ్చినవి 27 పాజిటీవ్ కేసులు న‌మోద‌య్యాయి.

Related News