బిగ్ బాస్ హౌస్ లో మిస్టర్ కూల్ గా పేరు తెచ్చుకున్న అభిజిత్ చివరకి టైటిల్ ను కూడా సొంతం చేసుకున్నాడు. అయితే హౌస్ లో నుంచి బయటకు వచ్చిన అభిజిత్ తాజాగా ఓ టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన విషయాలు వెల్లడించాడు. బిగ్ బాస్ హౌస్ లో మోనాల్ అభిజిత్ అఖిల్ ల ట్రయాంగిల్ లవ్ స్టోరీ గురించి అందరికీ తెలిసిందే.
ఆ తర్వాత అభిజిత్ మోనాల్ కు దూరంగా ఉండటం అదే సమయంలో హారిక అభిజిత్ లు క్లోజ్ గా ఉండటం వీరిద్దరి మధ్యా రొమాంటిక్ సంబాషణలు ఇలా షోలో సగానికి పైగా వీరి గురించే చూపించేవారు. బయట హారిక అభిజిత్ ల పేరిట ‘అభిక’ పేరుతో సోషల్ మీడియాలో పేజీలు కూడా తెరిచేసారు. ప్రేక్షుకులు కూడా వీరిద్దరి మధ్యా ఏదో ఉందని అనుకున్నారు.
హారిక లాంటి కోడలు వస్తే మంచిదే అని అభిజిత్ తల్లి.. ఆమెకు ఇష్టమైన వారిని పెళ్లి చేసుకుంటే తమకేమీ అభ్యంతరం లేదని హారిక తల్లి స్టేట్ మెంట్లు ఇవ్వడంతో వీరిద్దరి టాపిక్ హేఇఘ్ ఎట్ అయ్యింది. అయితే హౌస్ నుంచి బయటకు వచ్చిన అభిజిత్ ఇదంతా చూసి ఖంగుతిన్నాడట.
తాను హరికను ఒక చెల్లిలాగా చూశానని చెప్పి షాకిచ్చాడు. ఆ విషయం హరికకు కూడా చాలా సార్లు చెప్పాడట. కానీ షోలో ఎక్కడా అవి చూపించలేదని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు అభిజిత్ మాటలు విన్న ప్రేక్షకులంతా బిగ్ బాస్ నిర్వాహకులు రేటింగ్ల కోసం ప్రేక్షకులను పిచోళ్లను చేసారని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.