logo

  BREAKING NEWS

తొలి టీకా పై వెనక్కి తగ్గిన ఈటెల.. కారణం ఇదే!  |   తెలుగు రాష్ట్రాల సీఎంలకు కేంద్ర మంత్రి లేఖ.. కీలక ఆదేశాలు!  |   వాక్సిన్ వికటించి 23 మంది మృతి.. మరో 23 మందికి అస్వస్థత!  |   వాక్సిన్ తీసుకున్నవారిలో ఈ లక్షణాలు కనిపిస్తాయి: కేంద్రం కీలక వ్యాఖ్యలు!  |   ఇది విన్నారా..? కుంబాల గోత్రం.. ఆర్త్రా న‌క్ష‌త్రం.. జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి  |   ఏ వయసు వారికి టీకా వేస్తారు? సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?  |   జనగామకు బీజేపీ చీఫ్ బండి సంజయ్.. ఉద్రిక్త వాతావరణం  |   సీరం కీలక ప్రకటన.. కరోనా వాక్సిన్ ధర ఎంతంటే?  |   చంద్రబాబు వ్యాఖ్యల దుమారం.. భారీ షాకిచ్చిన సొంత పార్టీ నేతలు!  |   వ్యవసాయ చట్టాలపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు!  |  

మహిళల భద్రతకు ‘అభయం’ యాప్.. ఎలా పనిచేస్తుంది? ప్రత్యేకతలేమిటి?

మహిళలు,చిన్నారుల భద్రతే లక్ష్యంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ఆటోలు క్యాబ్ లలో ప్రయాణించే మహిళల కోసం మరో కొత్త ప్రాజెక్టును ప్రారంభించింది. ‘అభయం’ పేరుతో ఓ మొబైల్ యాప్ ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించారు. మహిళలు ఆపద సమయంలో ఒక్క బటన్ నొక్కితే పది నిమిషాలలో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే విధంగా ఈ యాప్ ను రూపొందించారు. మహిళల కోసం ఇప్పటికే రూపొందించిన దిశ యాప్ యాప్ ను పోలీసు శాఖ నిర్వహించగా… అభయం యాప్ ను రవాణా శాఖ నిర్వహించనుంది.

ఐవోటీ ఆధారంగా పనిచేసే ప్రత్యేక పరికరాలను ఆటోలు, క్యాబులకు అమరుస్తారు. డ్రైవర్ల లైసెన్సులకు రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా గుర్తించగలిగే టెక్నాలజీ కార్డులు ఇస్తారు. ఈ కార్డులతో ఇంజన్ దగ్గర అమర్చిన పరికరాన్ని స్వైప్ చేస్తేనే ఆ వాహనం స్టార్ అవుతుంది. దీని ద్వారా వాహనం, వాహనం నడిపే డ్రైవర్ పూర్తి అధికారుల నిఘాలో ఉంచబడతాడు. వాహనాలకు అమర్చిన ఇవోటీ పరికరాల ద్వారా వాహనాన్ని ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తారు. ఆటోలు, క్యాబ్ లలో ప్రయాణించే మహిళలు స్మార్ట్ ఫోన్ ద్వారా అభయం యాప్ ను ఇన్ స్టాల్ చేసుకోవాలి.

ప్రతి వాహనానికి ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. మహిళలు వాహనం ఎక్కేముందు మొబైల్ ద్వారా ఈ కోడ్ ను స్కాన్ చేయవలసి ఉంటుంది. ఆ వెంటనే డ్రైవర్ ఫొటోతో సహా వాహనం వివరాలన్నీ మొబైల్ కు వస్తాయి. ఈ నంబర్ ను ఆపద సమయంలో యాప్ ద్వారా పంపిస్తే వాహనం జిపిఎస్ సహాయంతో రవాణా శాఖ అధికారులు దానిని ట్రాక్ చేసి పట్టుకుంటారు. స్మార్ట్ ఫోన్ లేని మహిళల ప్రయాణ సమయంలో ఏదైనా ఇబ్బందికి గురైతే వెంటనే వాహనానికి అమర్చిన పానిక్ బట్టన్ ను నొక్కాలి. ఈ బటన్ నొక్కిన వెంటనే కొద్ది సమయానికి వాహనం ఆగిపోతుంది. కమాండ్ కంట్రోల్ సెంటర్ కు ఈ సమాచారం చేరుతుంది. దీంతో పది నిమిషాల్లో పోలీసులు వాహనాన్ని ట్రాక్ చేసి అక్కడకు చేరుకుంటారు.

Related News