logo

  BREAKING NEWS

కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడికి ముహూర్తం ఫిక్స్.. కీలక ప్రకటన!  |   అయోధ్య రామ‌మందిరానికి ప‌వ‌న్ క‌ళ్యాణ్ భారీ విరాళం  |    గవర్నర్ తో నిమ్మగడ్డ భేటీ.. ఏం తెలుస్తారో?  |   చికెన్‌, కోడిగుడ్లు ఇలా తింటే డేంజ‌ర్‌.. fssai జాగ్ర‌త్త‌లు  |   తిరుపతి ఉపఎన్నిక పోరులో జనసేన అభ్యర్థి.. పవన్ క్లారిటీ!  |   బ్రేకింగ్‌: తెలంగాణ‌లో ఇక వారికి 10 శాతం రిజ‌ర్వేష‌న్లు  |   పంచాయతీ ఎన్నికలు: నిమ్మగడ్డకు ఉద్యోగ సంఘాల షాక్!  |   ‘కాబోయే సీఎం కంగ్రాట్స్’ వేదికపైనే షాకిచ్చిన మంత్రి.. కేటీఆర్ రియాక్షన్ ఇదే!  |   ప‌వ‌న్ క‌ళ్యాణ్ – రామ్‌చ‌ర‌ణ్‌తో ఇండియా టాప్ డైరెక్ట‌ర్ సినిమా..?  |   ‘గుంటూరు’కు చెందిన కోహినూర్ వజ్రం బ్రిటన్ చేతికి ఎలా వెళ్ళింది?  |  

ఎంఐఎం నేత కాల్పుల్లో గాయపడ్డ సయ్యద్ మృతి…!

ఆదిలాబాద్‌లో ఎంఐఎం నేత షారూఖ్ అహ్మద్ (48) జరిపిన కాల్పుల్లో ఒకరు మృతి చెందారు. కాల్పులో తీవ్రంగా గాయపడిన సయ్యద్ జమీర్(52) ను హుటాహుటిన రిమ్స్ కు అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ నిమ్స్ కు తరలించి చికిత్స అందించారు. కాగా బుల్లెట్ గాయాల తీవ్రత అధికంగా ఉండటంతో శనివారం ఉదయం చికిత్స పొందుతూ జమీర్ మృతి చెందాడు.

ఈ నెల 18 న ఆదిలాబాద్ జిల్లా తాటిగూడలో పాత కక్షలు భగ్గుమన్నాయి. క్రికెట్ బ్యాట్ విషయంలో నెలకొన్న వివాదం ఒకరి ప్రాణాలు తీసింది. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఎంఐఎం జిల్లా అధ్యక్షుడైన షారూఖ్ అహ్మద్ కత్తి, తుపాకితో ప్రత్యర్థి వర్గంపై కాల్పులకు తెగబడ్డాడు. ఇద్దరిపై కాల్పులు జరుపగా మరొకరిపై కత్తితో దాడి చేసాడు.

షారూఖ్ కాల్పుల్లో జమీర్ శరీరంలోకి రెండు బుల్లెట్లు దూసుకెళ్లాయి. మోతేషాన్ తీవ్రంగా గాయపడ్డాడు. తీవ్రంగా గాయపడిన జమీర్‌ను హైదరాబాద్ నిమ్స్‌‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న అతని పరిస్థితి విషమించడంతో ఈరోజు కన్నుమూశాడు. ఈ వీడియో వారం రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే.

Related News