logo

  BREAKING NEWS

గుడ్ న్యూస్‌: క‌రోనా వైర‌స్‌కు వ్యాక్సిన్ వచ్చేసింది..!  |   వైఎస్సార్‌, చంద్ర‌బాబు స్నేహ‌బంధంపై సినిమా  |   క‌రోనా ఖతం అయ్యే డేట్ చెప్పిన బిల్ గేట్స్‌  |   నిజంగానే పాపం త‌గిలిన‌ట్లుంది… క‌రోనాతో ఆ ఎస్సై మృతి  |   జూనియ‌ర్ ఎన్టీఆర్ వల్ల కూడా ఆ ప‌ని కాదు.. కొడాని నాని హాట్ కామెంట్స్‌  |   బ్రేకింగ్‌: మాజీ రాష్ట్ర‌ప‌తికి క‌రోనా పాజిటీవ్‌  |   క‌న్న‌డ దంప‌తుల ధైర్యం… పీఓకేలోని శార‌దాపీఠం నుంచి అయోధ్య‌కు ప‌విత్ర మ‌ట్టి  |   పాక్ నుంచి వ‌చ్చిన ఒకే కుటుంబంలో 11 మంది ఆత్మ‌హ‌త్య‌  |   విజ‌య‌వాడ కోవిడ్ సెంట‌ర్‌లో అగ్ని ప్ర‌మాదానికి కార‌ణాలివే..!  |   ప్లాస్మా దానం అంటే ఏమిటి ? ఎవ‌రు చేయాలి ? ఎలా చేయాలి ?  |  

భారత్ లో విరుచుకుపడుతున్న కరోనా.. రికార్డు స్థాయిలో కేసులు!

భారత్ లో కరోనా విలయతాండవం చేస్తుంది. దాదాపుగా రోజుకు 20 వేలకు పైగా కేసులు నమోదవుతూ ఇప్పుడు ఏకంగా ఇప్పుడు 9 లక్షల మార్కును దాటేసింది. గత నెల చివరి వారంలో దేశంలో 5 లక్షల కేసులు ఉండగా కేవలం 15 రోజుల వ్యవధిలోనే ఈ సంఖ్య 9 లక్షలకు చేరుకుంది. ఈ పరిస్థితులు దేశంలో కరోనా తీవ్రతకు అద్దం పడుతున్నాయి.

తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో భారత్‌లో 28,498 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే. అదే సమయంలో 553 మంది కరోనా మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు.

తాజా కేసులతో భారత్ లో మొత్తం కరోనా కేసులు 9,06,752కి చేరగా, మొత్తం మృతుల సంఖ్య 23,727కి పెరిగింది. 3,11,565 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 5,71,460 గా నమోదైంది.

Related News