logo

  BREAKING NEWS

ఏపీలో 80 వేలు దాటిన కరోనా కేసులు.. అత్యధిక కేసులున్న జిల్లాలు ఇవే!

ఏపీలో కరోనా విలయతాండవం చేస్తుంది. తాజాగా నమోదైన కరోనా కేసులతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 80 వేలు దాటింది. గడిచిన 24 గంటల్లో 48,114 శాంపిల్స్ పరీక్షించగా.. అందులో 8,147 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ గా ఉన్న కేసుల సంఖ్య 80,858కు చేరింది. 24 గంటల్లో కరోనా మరణాల సంఖ్య 49 మంది మరణించగా.. మొత్తం మృతుల సంఖ్య 933కు చేరింది.

ప్రస్తుతం ఏపీలో 39,990 యాక్టివ్ కేసులు ఉండగా.. 39,935 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అందులో నిన్న ఒక్కరోజే 2,380 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. తూర్పుగోదావరి(11067), కర్నూలు(9615), గుంటూరు(8800), అనంతపురం(8266) జిల్లాల్లో అత్యధిక పాజిటివ్ కేసులతో కరోనాకు హాట్ స్పాట్లుగా ఉన్నాయి. అత్యధిక మరణాలు సంభవిస్తున్న జిల్లాల్లో కర్నూలు(150), కృష్ణ(133), తూర్పుగోదావరి(107), గుంటూరు(88), అనంతపురం(81) జిల్లాకు ఉన్నాయి.

జిల్లాల వారీగా కేసుల సంఖ్య చూసుకుంటే..
అనంతపురం 984
చిత్తూరు 630
తూర్పుగోదావరి 1029
గుంటూరు 703
కడప 494
కృష్ణ 359
కర్నూలు 914
నెల్లూరు 278
ప్రకాశం 355
శ్రీకాకుళం 374
విశాఖపట్నం 898
విజయనగరం 322
పశ్చిమ గోదావరి 807

Related News