logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

రౌడీ షీటర్ల కాల్పులు.. 8 మంది పోలీసులు మృతి..!

రౌడీ షీటర్ల కాల్పుల్లో డిఎస్పీ తో సహా ఎనిమిది మంది పోలీసులు మృతి చెందిన ఘటన కలకలం రేపింది. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ లో ఈ దారుణం చోటుచేసుకుంది. ఈరోజు తెల్లవారుజామున శివారు ప్రాంతమైన చౌబెపూర్‌లోని పోలీస్ స్టేషన్ పరిధిలో బిక్రూ గ్రామంలో రౌడీ షీటర్ వికాస్ దూబేను పట్టుకునేందుకు 10 మందికి పైగా పోలీసుల బృందం బయలుదేరింది.

రౌడీ షీటర్లు పోలీసులపై కాల్పులకు తెగబడటంతో 8 మంది పోలీసులు అక్కడికక్కడే మృతి చెందగా నలుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. ప్రస్తుతం వీరిని ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. పోలీసుల మృతి ఘటనపై సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు. నిందితులపై కఠిన చర్యలకు ఆదేశించారు.

కాగా నిందితులను పట్టుకునేందుకు ఇతర జిల్లాల నుంచి అదనపు సిబ్బందిని రప్పించామని, ఎలాగైనా వారిని పట్టుకుని తీరుతామని కాన్పూర్‌ ఏడీజీ జేఎన్‌ సింగ్‌ తెలిపారు. 2001లో బీజేపీ మంత్రిగా ఉన్న సంతోష్ శుక్లాను హత్య చేసిన కేసులో రౌడీ షీటర్ వికాస్ దూబే ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అంతేగాక దూబేపై మొత్తం 57 క్రిమినల్ కేసులు ఉన్నాయి.

Related News