ఎలక్ట్రానిక్ దిగ్గజం నోకియా నుంచి సరికొత్త స్మార్ట్ టీవీ భారత మార్కెట్లోకి విడుదలైంది. మొదట యూరప్ లో దీనిని లంచ్ చేయగా ఇప్పుడు భారత మార్కెట్లో సందడి చేయనుంది. నోకియా నుంచి వచ్చిన ఈ 75 అంగుళాల స్మార్ట్ టీవీ ఇప్పుడు ఎలక్ట్రానిక్ ప్రియులను ఆకట్టుకుంటుంది. ఈ స్మార్ట్ టీవీ ధర, స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. నోకియా 75 అంగుళాల టీవీ ధరను 1,399 యువాన్లుగా(సుమారు రూ.1,23,300) నిర్ణయించారు. ఇందులోనే 58 అంగుళాల వేరియంట్ ధర 799.9 యూరోలుగా(మనదేశ కరెన్సీలో సుమారు రూ.70,500) నిర్ణయించారు. వీటికి సంబంధించి డిసెంబర్ 1వ తేదీ నుంచి సేల్ ను ప్రారంభించనున్నారు.
నోకియా స్మార్ట్ టీవీ(75 అంగుళాలు) ప్రత్యేకతలు..
ఆండ్రాయిడ్ టీవీ 9.0 ఆపరేటింగ్ సిస్టంపై ఈ టీవీ పని చేయనుంది. 4కే యూహెచ్డీ డిస్ ప్లే ప్యానెల్ ను అందించారు. వీటితో పాటుగా డాల్ఫీ విజన్, హెచ్ డీ ఆర్10, సపోర్ట్ కూడా అందించారు. ఇందులో రెండు టీవీ 12w స్పీకర్లను అందించారు. డాల్బీ డిజిటల్ ప్లస్, డీటీఎస్ సర్రౌండ్ సౌండ్ టెక్నాలజీని ద్వారా ఈ స్మార్ట్ టీవీ పని చేస్తుంది. క్వాడ్ కోర్ ఏఆర్ఎం సీఏ55 ప్రాసెసర్ ను అమర్చారు. 1.5 జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ను ఇందులో అందించారు
వైఫై, బ్లూటూత్ 4.2 వంటి వైర్ లెస్ కనెక్టివిటీ ఫీచర్లను కూడా అదనంగా అందిస్తున్నారు. వీటితో పాటుగా 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్‌ను నాలుగు హెచ్డీఎంఐ పోర్టులు, రెండు యూఎస్బీ 2.0 పోర్టులు, ఆప్టికల్ ఆడియో, వీజీఏ, ఎథర్ నెట్ పోర్టులను కూడా అందించారు. గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ తో పాటుగా అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్ స్టార్, నెట్ ఫ్లిక్స్, యూట్యూబ్ వంటి యాప్స్ ను కూడా ఈ స్మార్ట్ టీవీలో ఉపయోగించుకోవచ్చు.