logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

భార‌త్‌లోనే 67 కోట్ల మందికి క‌రోనా వైర‌స్‌..!

భార‌త్‌లో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తిపై భ‌య‌పెట్టే అంచ‌నాలు చెబుతున్నారు నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంట‌ల్ హెల్త్ ఆండ్ న్యూరోసైన్స్ వైద్యులు. నాలుగో విడ‌త లాక్‌డౌన్ పూర్త‌య్యాక దేశంలో క‌రోనా వైర‌స్ సామూహిక వ్యాప్తి అవుతుంద‌ని వీరు అంచ‌నా వేశారు. 2020 డిసెంబ‌ర్ నాటికి దేశంలో స‌గం జ‌నాభా అంటే, సుమారు 67 కోట్ల మంది క‌రోనా వైర‌స్ బారిన ప‌డ‌తార‌ని పేర్కొన్నారు. అయితే, క‌రోనా బారిన ప‌డిన 90 శాతం మందికి వారికి అస‌లు వారికి క‌రోనా వ‌చ్చింద‌నే విష‌యం కూడా తెలియ‌కుండానే వెళ్లిపోతుంద‌ని తెలిపారు.

90 శాతం మందికి క‌రోనా ల‌క్ష‌ణాలు ఉండ‌వ‌ని, కేవ‌లం ఐదు శాతం మందికే ఆరోగ్యం క్షీణించి ఆసుప‌త్రుల‌కు వెళ్లాల్సిన వ‌స్తుంద‌న్నారు. 67 కోట్ల మందిలో సుమారు 3 కోట్ల మంది ఆసుప‌త్రుల్లో చికిత్స పొందాల్సిన ప‌రిస్థితి రావ‌చ్చ‌ని వైద్యులు అంచ‌నా వేశారు. కాగా, భార‌త్‌లో జులై మొద‌టికి క‌రోనా వైర‌స్ వ్యాప్తి గ‌రిష్ఠ స్థాయికి చేరి అక్క‌డి నుంచి త‌గ్గుముఖం ప‌డుతుంద‌ని ప‌లువురు శాస్త్ర‌వేత్త‌లు అంచ‌నా వేస్తున్నారు. ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ మాత్రం జులై చివ‌ర‌కు భార‌త్‌లో క‌రోనా వ్యాప్తి గ‌రిష్ఠానికి చేరి త‌ర్వాత త‌గ్గుతుంద‌ని చెబుతోంది.

Related News