logo

  BREAKING NEWS

కరోనా వ్యాప్తి: కేసీఆర్ ప్రభుత్వం కీలక నిర్ణయం!  |   హైదరాబాద్ పరిధిలో ఈ పది డివిజన్లే ‘కరోనా’ డేంజర్ జోన్లు!  |   బ్రేకింగ్: సచివాలయం కూల్చివేత పై ప్రభుత్వానికి హైకోర్టు షాక్!  |   బ్రేకింగ్: కంటైన్మెంట్ జోన్ గా తిరుమల  |   గాంధీ కుటంబానికి ఊహించని షాకిచ్చిన కేంద్రం..!  |   ప్రపంచాన్ని వణికిస్తున్న ‘బుబోనిక్ ప్లేగు’.. ఇది కరోనా కన్నా డేంజర్!  |   గాల్వన్ లోయ నుంచి చైనా వెనక్కి.. డ్రాగన్ ను నమ్మలేమంటున్న భారత్  |   చైనాతో యుద్ధం.. భారత్ కు మద్దతుగా నిలుస్తున్న దేశాలు ఇవే!  |   హైదరాబాద్ లో మళ్ళీ లాక్ డౌన్ లేనట్టే.. కారణం ఇదే!  |   బ్రేకింగ్‌: తెలంగాణ‌లో ఇవాళ భారీగా న‌మోదైన క‌రోనా కేసులు  |  

తబ్లీఘి జమాత్ సభ్యులకు భారీ షాకిచ్చిన కేంద్ర ప్రభుత్వం..!

దేశ రాజధాని ఢిల్లీ నిజాముద్దీన్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన తబ్లీఘి జమాత్ సమావేశం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. తాజాగా ఈ సమావేశంలో పాల్గొన్న విదేశియులకు కేంద్ర ప్రభుత్వం భారీ షాకిచ్చింది. లాక్ డౌన్ నిబంధనలను ఉలంఘించడమే కాకుండా కరోనా వైరస్ ను దేశంలోకి ఆహ్వానించారని వీరిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసారు పోలీసులు.

అయితే వీరంతా వీసా నిబంధనలు కూడా ఉల్లంఘించారని అధికారులు తెలిపారు. జమాత్ సభ్యుల నిర్లక్ష్యానికి నేడు వేల మంది కొరోనాతో పోరాడుతున్న విషయం తెలిసిందే. కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఈ కార్యక్రమానికి హాజరైన విదేశీయుల సంఖ్య వేలల్లోనే ఉందని తెలుస్తుంది. విజిటింగ్ వీసాలతో దేశంలోకి వచ్చి మతపరమైన కార్యక్రమాలలో పాల్గొన్నారు.

వీరిపై వీసా నిబంధనల యాక్ట్ తో పాటుగా ఇతర కేసులు కూడా నమోదయ్యాయి. తాజాగా కేంద్రం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. తబ్లీఘి జమాత్ సమావేశంలో పాల్గొన్న 2,200 మంది విదేశీయులపై వీసా ఉల్లంఘన కింద కేసులు నమోదు చేయడంతో పాటుగా పదేళ్ల పాటు భారత్ లో అడుగుపెట్టకుండా వీరిపై నిషేధం విధించింది. .

Related News