logo

  BREAKING NEWS

ఓటీటీలో రిలీజైన కేజీఎఫ్: చాప్ట‌ర్‌-2..! కానీ షాకిచ్చిన అమెజాన్ ప్రైమ్‌  |   టాయిలెట్‌లో కెమెరా.. హోంమంత్రికి ఫిర్యాదు  |   కాబోయే భ‌ర్త మృతి.. ఆ యువ‌తి చేసిన ప‌నికి క‌న్నీళ్లు ఆగ‌వు  |   స‌లార్ సినిమాపై కిక్కిచ్చే వార్త‌  |   మ‌హేష్ – రాజ‌మౌళి సినిమాపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన విజ‌యేంద్ర ప్ర‌సాద్‌  |   వంద‌ల ఎక‌రాల భూమి ఉన్న కుటుంబంలో కేసీఆర్ పుట్టారు  |   2022 – 23కు కేంద్రీయ విద్యాల‌య అడ్మిష‌న్లు ప్రారంభం.. పూర్తి వివ‌రాలు  |   నిరుద్యోగుల‌కు భారీ శుభ‌వార్త‌.. రైల్వేలో 2,65,547 ఖాళీలు  |   మ‌రో కొత్త ప‌థ‌కాన్ని ప్రారంభించ‌నున్న జ‌గ‌న్‌.. దేశంలోనే మొద‌టిసారి  |   అండ‌మాన్ ఎన్నిక‌ల్లో మ‌రోసారి స‌త్తా చాటేందుకు చంద్ర‌బాబు స్కెచ్‌  |  

షాకింగ్ సర్వే.. హైదరాబాద్ లో ప్రతి ఇంట్లో ఒకరికి కరోనా!

కరోనాతో వణికిపోతున్న హైదరాబాదీలకు సీసీఎంబీ డైరెక్టర్ రాకేష్ మిశ్రా శుభవార్త వినిపించారు. నగరంలో సగం మంది జనాభా తమకు తెలియకుండానే కరోనాను జయించారని ప్రకటించారు. తాజాగా సీసీఎంబీ పలు సంస్థలతో కలిసి నిర్వహించిన సర్వేలో ఈ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.

ఈ సర్వేలో భాగంగా నగరంలోని 150 డివిజన్లలో 30 వార్డుల్లోని తొమ్మిది వేల మంది నమూనాలను సేకరించారు. 10 ఏండ్ల నుంచి 90 ఏండ్ల మధ్య వయసు వారిపై ఈ సర్వేను నిర్వహించారు. దాదాపు వీరందరిలో ఒకే స్థాయిలో యాంటీ బాడీలు ఉన్నట్టుగా గుర్తించారు. కరోనా వైరస్ సోకిన వారిలోనే ఆ వైరస్ ను ఎదుర్కోవడానికి యాంటీ బాడీలు ఉత్పత్తి అవుతాయన్న విషయం తెలిసిందే. అంటే ఈ లెక్కన భాగ్యనగరంలో నివసిస్తున్న ప్రతి ఇంట్లో ఒక వ్యక్తి కరోనా బారిన పడి ఉండవచ్చని సీసీఎంబీ డైరెక్టర్ రాకేష్ మిశ్రా అభిప్రాయపడ్డారు.

కరోనా బారిన పడిన వారికే వీరే అధికం..

అత్యధికంగా స్త్రీలలో 56 శాతం మందికి యాంటీ బాడీలు ఉండగా పురుషులలో 54 శాతం మందికి ఉన్నట్టు తేలింది. 70 ఏండ్లు పైబడిన వారిలో 49 మందికి యాంటీ బాడీలు ఉన్నట్టుగా గుర్తించారు. అంటే కరోనా ఎంత నిశ్శబ్దంగా వ్యాపిస్తుందో తెలిపేందుకు ఇదే నిదర్శనమని అధికారులు హెచ్చరిస్తున్నారు. వీరిలో కరోనా సోకిన వ్యక్తికి సన్నిహితంగా మెలిగిన వారు, వారి కుటుంబసభ్యులే అధికంగా ఉన్నారు. కరోనా బారినపడ్డ కుటుంబాల్లో 78శాతం మందికి యాంటీబాడీస్ ఉత్పత్తి అయినట్లు.. 68శాతం మందికి బయటి సమూహాల ద్వారా వైరస్ వచ్చి పోయినట్లు అధ్యయనంలో తేలింది.

హార్డ్ ఇమ్మ్యూనిటీ వచ్చినా ఆ ముప్పు..

ఈ సర్వేలో పాల్గొన్న వారిలో 75 శాతం మందికి తమకు కరోనా సోకిన విషయమే తెలియదని సర్వేలో వెల్లడించారు. సర్వే అందించిన ఫలితాల ప్రకారం హైద్రాబాద్ హార్డ్ ఇమ్యూనిటీ దిశగా అడుగులు వేస్తున్నట్టుగా రాకేష్ మిశ్రా పేర్కొన్నారు. జనాభాలో సగం మందికి కరోనా వచ్చిపోయిన కారణంగా హార్డ్ ఇమ్యూనిటీ సాధించే వీలున్నా.. అదే సమయంలో కరోనా మన చుట్టూనే ఉందని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మొదటికే మోసం వచ్చే అవకాశం ఉందన్నారు. మరి ఇప్పుడు యాంటీ బాడీలు ఉన్నవారికి కరోనా వాక్సిన్ అవసరమా? అనే విషయంపై కూడా స్పష్టత నిచ్చారు.

యాంటీబాడీలు ఉన్నా వాక్సిన్ తీసుకోవాలా?

ఈ సర్వేలో పాల్గొన్న వారిలో యాంటీ బాడీలు ఉన్నా.. వారు వాక్సిన్ తీసుకోవడమే మేలన్నారు. ప్రస్తతం 80 శాతం మందికి వైరస్ ను తట్టుకునే సామర్థ్యం వచ్చింది. వాక్సిన్ వేయడం ద్వారా ఈ యాంటీబాడీల శాతం మరింత రెట్టింపు కానుంది. గతంలో ఇప్పటికే ఒకసారి కరోనా బారిన పడిన వారిలో రీ ఇన్ఫెక్షన్ కనిపించడం లేదని రాకేష్ మిశ్రా పేర్కొన్నారు. సీఎస్ఐఆర్, సీసీఎంబీ, ఐసీఎంఆర్, ఎన్ఐఎన్ సంస్థలు భారత్ బయోటెక్ తో కలిసి సంయక్తంగా ఈ సర్వేని నిర్వహించాయి.

Related News