logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

ఏపీలో మ‌రో 54 క‌రోనా కేసులు.. వేగంగా కోలుకుంటున్న బాధితులు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌‌లో క‌రోనా వైర‌స్ ప్ర‌భావం త‌గ్గ‌డం లేదు. రాష్ట్రంలో గ‌త 24 గంటల్లో 7,320 సాంపిల్స్ ని పరీక్షించగా 54 మంది కోవిడ్19 పాజిటివ్‌గా తేలింది. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1887కు చేరింది. వీరిలో 842 మంది డిశ్చార్జ్ కాగా, 41 మంది మరణించారు. ప్రస్తుతం 1004 మంది చికిత్స పొందుతున్నారు. గ‌త 24 గంట‌ల్లో 62 మంది క‌రోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.

కాగా, ఇప్ప‌టి వ‌ర‌కు ఎక్కువ ప్ర‌భావం ఉన్న క‌ర్నూలు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో గ‌త 24 గంట‌ల్లో త‌క్కువ కేసులు న‌మోదు కాగా, విశాఖ‌ప‌ట్నం, అనంత‌పురం జిల్లాల్లో ఎక్కువ కేసులు న‌మోద‌య్యాయి. కొత్త‌గా అనంత‌పురంలో 16, విశాఖ‌ప‌ట్నంలో 11, ప‌శ్చిమ గోదావ‌రిలో 9, క‌ర్నూలులో 7, కృష్ణాలో 6, చిత్తూరులో 3, విజ‌య‌న‌గ‌రంలో 1, గుంటూరులో 1 పాజిటీవ్ కేసులు న‌మోద‌య్యాయి.

ఇప్ప‌టివ‌ర‌కు క‌ర్నూలు జిల్లాలో 547, గుంటూరు జిల్లాలో 374, కృష్ణా జిల్లాలో 322, అనంత‌పురంలో 99, క‌డ‌ప‌లో 96, నెల్లూరులో 96, చిత్తూరులో 85, ప‌శ్చిమ గోదావ‌రిలో 68, ప్ర‌కాశంలో 61, విశాఖ‌ప‌ట్నంలో 57, తూర్పు గోదావ‌రిలో 46, శ్రీకాకుళంలో 5, విజ‌య‌న‌గ‌రంలో 4, గుజ‌రాత్ నుంచి వ‌చ్చిన వ‌ల‌స కూలీల్లో 26, క‌ర్ణాట‌క నుంచి వ‌చ్చిన వారిలో 1 పాజిటీవ్ కేసులు న‌మోద‌య్యాయి. గ‌త 24 గంట‌ల్లో ముగ్గురు క‌రోనా కార‌ణంగా మ‌ర‌ణించారు. క‌ర్నూలులో ఇద్ద‌రు, విశాఖ‌ప‌ట్నంలో ఒక‌రు గ‌త 24 గంట‌ల్లో మ‌ర‌ణించారు.

Related News