logo

  BREAKING NEWS

బీజేపీ పార్టీలోకి తెలంగాణ ఫైర్ బ్రాండ్?… క్లారిటీ వచ్చేసింది!  |   మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్: చరిత్ర మరువని రియల్ హీరో స్టోరీ!  |   8 గంట‌ల కంటే ఎక్కువ ప‌ని చేయ‌డం ఎంత డేంజ‌రో తెలుసా ?  |   53 మంది మహిళా ఖైదీలకు సీఎం జగన్ శుభవార్త!  |   బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల: గ్రేటర్ ప్రజలపై వరాల జల్లు!  |   ఎడ‌మ చేతివాటం ఎందుకు వ‌స్తుంది ? వారిలో తేడా ఏముంటుంది ?  |   ఏబీ వెంకటేశ్వర్ రావుకు సుప్రీంలో షాక్..!  |   జ‌గ‌న‌న్న తోడు.. పేద‌ల‌కు రూ.10 వేలు.. ఇలా పొందాలి  |   ‘దమ్ముంటే కూల్చరా’.. అక్బరుద్దీన్ కు బండి సంజయ్ సవాల్!  |   మేయర్ పీఠాన్ని దక్కించుకోగానే వారిని తరిమికొడతాం .. పాతబస్తీపై బండి సంచల వ్యాఖ్యలు  |  

ఒకే కుటుంబంలో ఐదుగురు మిస్సింగ్.. కలకలం రేపుతున్న ఘటన

ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు కనిపించకుండా పోయిన ఘటన నెల్లూరు జిల్లాలో కలకలం రేపుతోంది. వారిలో ఇద్దరి మహిళలు కాగా మిగిలిన వారు 5 ఏళ్ల లోపు చిన్నారులు ఉన్నారు. వేంకటగిరి మండలానికి చెందిన ఈ ఇద్దరు మహిళలు తోడికోడళ్ళుగా తెలుస్తుంది. వీరు ఆరోగ్యం బాగా లేకపోవడంతో జీకే పల్లి నుంచి మండల కేంద్రమైన వెంకటగిరి ఆసుపత్రికి వెళ్లేందుకు నిన్న మధ్యాహ్నం ఆటో ఎక్కారు.

ఆ తర్వాత వీరి ఆచూకీ తెలియరాలేదు. నిన్న మధ్యాహ్నం 1 గంట నుంచి వీరి నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఈ ఘటన జరిగి 24 గంటలు గడుస్తుండటంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. మహిళలు, పిల్లల కోసం గ్రామస్థులు, పోలీసులు గాలిస్తున్నారు. ఆసుపత్రికని బయలుదేరిన వీరు ఎక్కడకు వెళ్లి ఉంటారు అనే విషయం పై ఆరా తీస్తున్నారు.

Related News