logo

  BREAKING NEWS

తుమ్ములు ఎక్కువ‌గా వ‌స్తున్నాయా ? ఈ చిట్కా పాటిస్తే త‌గ్గిపోతాయి  |   జ‌గ‌న్‌ను ఓడించే కుట్ర‌..? కొడాలి నాని పాత్ర‌..?  |   బ్రేకింగ్‌: జ‌గ‌న్ ఇంటి ముట్ట‌డి.. హైద‌రాబాద్‌, తిరుప‌తిలో ఉద్రిక్త‌త‌‌  |   బ్రేకింగ్: డ్ర‌గ్స్ వ్య‌వ‌హారంలో మ‌హేష్ బాబు స‌తీమ‌ణి న‌మ్ర‌త పేరు  |   అమెరికా నుంచి ఎలా వ‌చ్చింది..? ‘కాంగ్రెస్ గ‌డ్డి’ అని ఎందుకు పిలుస్తారు ?  |   తెలుగుదేశం పార్టీకి కొత్త అధ్య‌క్షుడి పేరు ఖ‌రారు  |   ఇక నుంచి ‘యాదాద్రి’ రైల్వే స్టేష‌న్‌  |   హ‌రీష్ రావు వ‌ర్సెస్ ర‌ఘునంద‌న్‌రావు  |   ఈ చిన్న ప‌ని చేస్తే 15 నిమిషాల్లో త‌ల‌నొప్పి మాయం  |   రూ.15,000 లోపు బెస్ట్ స్మార్ట్ టీవీలు ఇవే  |  

ప్రతిరోజూ 3 జీబీల డేటా, ఉచిత కాలింగ్స్.. జియో అద్భుతమైన ప్రీపెయిడ్ ప్లాన్లు ఇవే!

కరోనా కారణంగా ఇబ్బందులు ఎదుర్కుంటున్న స్మార్ట్ ఫోన్ యూజర్ల కోసం రిలయన్స్ జియో 5 కొత్త ప్లాన్స్ ను అందుబాటులోకి తెచ్చింది. లాక్ డౌన్ నేపథ్యంలో ఇంటి నుండి పని చేస్తున్న ఉద్యోగులకు అదనంగా డేటా అవసరం అవుతుంది. వారిని దృష్టిలో పెట్టుకుని జియో చౌక ధరకే ఈ ప్రీపెయిడ్ ప్లాన్స్ ను తీసుకొచ్చింది. రోజుకి 3 జీబీల మొబైల్ డేటాతో పాటుగా ఉచిత కాలింగ్ సౌకర్యం, మరిన్ని అదనపు బెనిఫిట్లను పొందవచ్చు.

రూ.149 తో రీచార్జ్ చేసుకున్న వారికి రోజుకి 1 జీబీ డేటా లభిస్తుంది. జియో నుంచి జియో కు ఉచితంగా కాల్స్ చేసుకోవచ్చు. ఇతర నెట్వర్క్ లకు అయితే 300 నిముషాలు ఉచితంగా కాల్స్ పొందుతారు.100 ఎస్ఎంఎస్ లు అదనం. ఈ పప్లాన్ వాలిడిటీ 24 రోజులే ఉంటుంది.

28 రోజుల వాలిడిటీని కోరుకునేవారు రూ. 199 ప్లాన్ ను ఎంచుకోవచ్చు. ఇందులో రోజుకి 1.5 జీబీ డేటా లభించడంతో పాటుగా జియో నుంచి జియోకు అన్ లిమిటెడ్ కాల్స్ ను మాట్లాడుకోవచ్చు. వేరే నెట్ వర్క్ అయితే 1000 నిమిషాల టాక్ టైం లభిస్తుంది. 100 ఎస్ఎంఎస్ లు పొందవచ్చు. ఇలాంటి ప్రయోజనాలతోనే రోజుకి 2 జీబీల డేటాను కావాలనుకునేవారు రూ. 249 తో రీచార్జి చేసుకోవచ్చు.

రోజుకి 3 జిబీల డేటా కోసం రూ. 349 ప్లాన్ ను ఎంచుకోవచ్చు. ఈ ప్లాన్ వాలిడిటీ కూడా 28 రోజులు ఉంటుంది. రూ. 399 ప్లాన్ ను ఎంచుకుంటే 56 రోజుల వాలిడిటీతో రోజుకి 1.5 జీబీల డేటా లభిస్తుంది. అన్ లిమిటెడ్ కాల్స్ తో పాటుగా ఈ ప్లాన్ లో ఇతర నెట్వర్క్ లకు 2000 టాక్ టైం, 100 ఎస్ఎంఎస్ లు పొందవచ్చు. పైన తెలిపిన ఏ ప్లాన్ ను ఎంచుకున్నా వినోదం కోసం జియో యాప్స్ ఉచిత సబ్ స్క్రిప్షన్ లభిస్తుంది.

Related News