logo

  BREAKING NEWS

అమిత్ షా వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్ కౌంటర్!  |   ఫామ్ హౌస్ నుంచి బయటకు వస్తేనే కదా తెలిసేది: కేసీఆర్ పై అమిత్ షా  |   వ్యాయామం ఏ వయసు వారు ఎంతసేవు చేయాలి: డబ్ల్యూహెచ్వో మార్గదర్శకాలు  |   బ్రేకింగ్: మంత్రి పేర్ని నానిపై హ‌త్యాయ‌త్నం  |   తెలంగాణలో కరోనా అప్ డేట్.. కొత్తగా నమోదైన కేసులు ఎన్నంటే?  |   ‘సర్జికల్ స్ట్రయిక్స్’ అంటే ఏమిటి? ఎలాంటి సందర్భాలలో నిర్వహిస్తారు?  |   బీజేపీ పార్టీలోకి తెలంగాణ ఫైర్ బ్రాండ్?… క్లారిటీ వచ్చేసింది!  |   మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్: చరిత్ర మరువని రియల్ హీరో స్టోరీ!  |   8 గంట‌ల కంటే ఎక్కువ ప‌ని చేయ‌డం ఎంత డేంజ‌రో తెలుసా ?  |   53 మంది మహిళా ఖైదీలకు సీఎం జగన్ శుభవార్త!  |  

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 32 జిల్లాలు..? కొత్త‌గా ఏర్ప‌డే జిల్లాలు ఇవే..!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వై.ఎస్. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు దిశ‌గా క‌స‌ర‌త్తు చేస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల ముందే ఆయ‌న తాము అధికారంలోకి వ‌స్తే కొత్త జిల్లాల‌ను ఏర్పాటు చేస్తామ‌ని, ప్ర‌తీ పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాన్ని ఒక జిల్లాగా మారుస్తామ‌ని జ‌గ‌న్ హామీ ఇచ్చారు. ఈ మాట ప్ర‌కార‌మే అధికారంలోకి రాగానే ఆయ‌న కొత్త జిల్లాల ఏర్పాటుపైన దృష్టి పెట్టారు.

జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నేతృత్వంలో ప్ర‌భుత్వం ఒక బృందం కూడా ఏర్పాటు చేసంది. వీరి ఇప్ప‌టికే రాష్ట్ర వ్యాప్తంగా నూత‌న జిల్లాల ఏర్పాటుపై వివిధ వ‌ర్గాల నుంచి అభిప్రాయాల‌ను సేక‌రించ‌డంతో పాటు కొత్త జిల్లాల ఏర్పాటు కోసం ప్ర‌తిపాద‌న‌లు సిద్ధం చేస్తోంది. ఈ నేప‌థ్యంలో రాష్ట్రంతొ మొత్తం 32 జిల్లాల‌ను ఏర్పాటు చేయ‌బోతున్నార‌ని జోరుగా ప్ర‌చారం సాగుతోంది.

ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఆలోచ‌న ప్ర‌కారం ప్ర‌తి పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాన్ని ఒక జిల్లాగా చేయాలి. అయితే, కొన్ని పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాలు చాలా పెద్ద‌వి. పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గానికి అందులోని కొన్ని అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు 70 – 80 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాలనే జిల్లాలుగా మారిస్తే ప‌రిపాల‌న‌ను సుల‌భ‌త‌రం చేయాల‌నే త‌మ ఆలోచ‌న పూర్తిస్థాయిలో స‌ఫ‌లం కాద‌ని ప్ర‌భుత్వం భావిస్తోంద‌ని తెలుస్తోంది.

అందుకే పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల‌ను జిల్లాలుగా చేస్తూనే జిల్లాలు అయ్యే అర్హ‌త‌లు ఉన్న ప్రాంతాల‌ను సైతం కొత్త జిల్లాలుగా ఏర్పాటు చేయ‌బోతున్నార‌నే ప్ర‌చారం సాగుతోంది. ఈ నేప‌థ్యంలో మొత్తం 32 జిల్లాల ఏర్పాటు జ‌ర‌గ‌బోతున్న‌ట్లు చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన లిస్టు కూడా ప్ర‌చారంలోకి వ‌చ్చింది. ఈ లిస్టు ప్ర‌కారం..

ప‌లాస, శ్రీకాకుళం, పార్వ‌తీపురం, విజ‌య‌న‌గ‌రం, విశాఖ‌ప‌ట్నం, అర‌కు, అన‌కాప‌ల్లి, కాకినాడ‌, అమ‌లాపురం, రాజ‌మండ్రి, న‌ర్సాపురం, ఏలూరు, మ‌చిలీప‌ట్నం, విజ‌య‌వాడ‌, అమ‌రావ‌తి, గుంటూరు, బాప‌ట్ల‌, న‌ర‌స‌రావుపేట‌, మార్కాపురం, ఒంగోలు, నెల్లూరు, గూడురు, తిరుప‌తి, చిత్తూరు, మ‌ద‌న‌ప‌ల్లె, హిందూపురం, అనంత‌పురం, ఆదోని, క‌ర్నూలు, నంద్యాల‌, క‌డ‌ప, రాజంపేట కొత్త జిల్లా‌లుగా మార‌నున్నాయ‌ని తెలుస్తోంది.

వీటిల్లో పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గ కేంద్రాలు కాకుండా శ్రీకాకుళంలో ప‌లాస‌, విజ‌య‌న‌గ‌రంలో పార్వ‌తీపురం, గుంటూరులో అమ‌రావ‌తి, ప్ర‌కాశంలో మార్కాపురం, నెల్లూరులో గూడురు, చిత్తూరులో మ‌ద‌న‌ప‌ల్లె, క‌ర్నూలులో ఆదోని కూడా కొత్త జిల్లాలుగా మార‌నున్నాయని తెలుస్తోంది. వెన‌క‌బాటు, అన్ని ప్రాంతాల‌కు మ‌ధ్య‌లో ఉండ‌టం వంటి కార‌ణాల వ‌ల్ల వీటిని కూడా జిల్లాలుగా ఏర్పాటు చేయ‌నున్నార‌నే ప్ర‌చారం సాగుతోంది. త్వ‌ర‌లోనే జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ప్ర‌భుత్వం నిర్ణ‌యిం తీసుకోబోతోంది.

Related News