logo

  BREAKING NEWS

షాకింగ్‌.. భార్య‌ల‌ను అద్దెకు ఇస్తున్నారు  |   కౌశీక్ రెడ్డికి బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఏకంగా డ‌బుల్ ప్ర‌మోష‌న్‌..!  |   తెలంగాణ బీజేపీకి జోష్‌.. త్వ‌ర‌లోనే మాజీ ఎంపీ, కాంగ్రెస్ కీల‌క నేత చేరిక‌  |   రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |  

2డీజీ ధ‌ర ప్ర‌క‌టించిన కేంద్రం.. హ‌మ్మ‌య్య‌.. అందుబాటు ధ‌ర‌నే

క‌రోనా చికిత్సలో స‌మ‌ర్థంగా ప‌ని చేస్తుంద‌ని భావిస్తున్న 2డీజీ డ్ర‌గ్ ధ‌ర‌ను కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఒక్కో సాచెట్ ధ‌ర రూ.990గా ఈ డ్ర‌గ్‌ను ఉత్ప‌త్తి చేస్తున్న డాక్ట‌ర్ రెడ్డీస్ ల్యాబ్స్ నిర్ణ‌యించింద‌ని కేంద్రం స్ప‌ష్టం చేసింది. అయితే, బ‌హిరంగ మార్కెట్‌లో ఈ ధ‌ర ఉంటుంద‌ని, కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు, ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల‌కు మాత్రం డిస్కౌంట్ ఇచ్చేందుకు డాక్ట‌ర్ రెడ్డీస్ అంగీక‌రించింద‌ని తెలిపింది. క‌రోనా బారిన ప‌డిన రోగుల‌ను కాపాడే అద్భుత‌మైన ఔష‌ధంగా ఈ 2డీజీ డ్ర‌గ్‌ను అభివృద్ది చేశారు.

దీని పూర్తి పేరు 2-డియాక్సీ డి-గ్లూకోజ్‌. డిఫెన్స్ రిసెర్చ్ ఆండ్ డెవెల‌ప్‌మెంట్ ఆర్గ‌నైజేష‌న్(డీఆర్‌డీఓ) ఆధ్వ‌ర్యంలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియ‌ర్ మెడిసిన్ ఆండ్ అలైడ్ సైన్సెస్‌(ఇన్‌మాస్‌), డాక్ట‌ర్ రెడ్డీస్ ల్యాబ్ సంయుక్తంగా ఈ డ్ర‌గ్‌ను త‌యారుచేశారు. ఇటువంటి డ్ర‌గ్‌ను గ‌తంలో క్యాన్స‌ర్‌ను నియంత్రించేందుకు త‌యారుచేశారు. శ‌రీరంలో ఉండే క్యాన్స‌ర్ క‌ణాల‌కు గ్లూకోజ్ వెళ్ల‌కుండా ఈ డ్ర‌గ్ అడ్డుకొని క్యాన్స‌ర్‌ క‌ణాలు బ‌ల‌హీన‌మ‌య్యేలా చేస్తుంది. ఇప్పుడు ఇదే ప‌ద్ధ‌తిలో క‌రోనా వైర‌స్‌కు విరుగుడుగా డ్ర‌గ్‌ను త‌యారుచేశారు. మ‌న శ‌రీరంలోకి చేరిన క‌రోనా వైర‌స్ క‌ణాల‌కు గ్లూకోజ్ అంద‌కుండా ఈ డ్ర‌గ్ చేస్తుంది.

క‌రోనా వైర‌స్ క‌ణాల‌కు గ్లూకోజ్ అంద‌న‌ప్పుడు క‌ణాల విభ‌జ‌న జ‌ర‌గ‌దు. దీంతో శ‌రీరంలో క‌రోనా వైర‌స్ వ్యాప్తి ఆగిపోతుంది. ఈ డ్ర‌గ్ గ్లూకోజ్ పౌడ‌ర్‌లా ఉంటుంది. ఈ పౌడ‌ర్‌ను నీటిలో క‌లుపుకొని తీసుకుంటే స‌రిపోతుంది. ఈ డ్ర‌గ్ వాడితే క‌రోనా బారిన ప‌డ్డ వ్య‌క్తి త్వ‌ర‌గా కోలుకుంటారు. రోగుల‌కు ఆక్సీజ‌న్ అవ‌స‌రం కూడా త‌గ్గుతుంది. 2డీజీ డ్ర‌గ్‌ను డాక్ట‌ర్ రెడ్డీస్ సంస్థనే ఉత్ప‌త్తి చేస్తోంది. ఈ నెల‌ 17వ తేదీన కేంద్ర‌మంత్రులు రాజ్‌నాథ్ సింగ్‌, డాక్ట‌ర్ హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ చేతుల మీదుగా 2డీజీ డ్ర‌గ్‌ను విడుద‌ల చేశారు.

మొద‌టి విడ‌త‌గా 10 వేల ప్యాకెట్‌ల డ్ర‌గ్‌ను ఢిల్లీలోని ఆసుప‌త్రుల్లో వినియోగించ‌నున్నారు. మే చివ‌ర‌లో రెండో విడ‌తగా మ‌రిన్ని ప్యాకెట్ల‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. జూన్ నుంచి పెద్ద మొత్తంలో ఉత్ప‌త్తి చేసి మార్కెట్‌లోకి కూడా అందుబాటులోకి తీసుకువ‌స్తారు. 2డీజీ డ్ర‌గ్ పూర్తిగా సుర‌క్షిత‌మైన‌ది. దీనికి సంబంధించిన క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ కూడా విజ‌య‌వంతంగా జ‌రిగాయి. క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్‌కు సంబంధించి స‌మాచారాన్ని పూర్తిగా విశ్లేషించిన త‌ర్వాత డీసీజీఐ ఈ డ్ర‌గ్ వినియోగానికి అత్య‌వ‌స‌ర అనుమ‌తులు ఇచ్చింది. ఈ డ్ర‌గ్‌ను వాడ‌టం ద్వారా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావ‌ని డీఆర్‌డీఓ ఛైర్మ‌న్ స‌తీష్ రెడ్డి స్ప‌ష్టం చేశారు.

Related News