కరోనా వాక్సిన్ వికటించి ఏకంగా 23 మంది మృతి చెందడం సంచలనంగా మారింది. ఫైజర్ సంస్థ- బయో ఎన్ టెక్ తో కలిసి తయారు చేసిన కరోనా టీకాను ఇటీవలే ఆమోదం లభించిన విషయం తెలిసిందే.. సాధారణంగా టీకా తీసుకున్న వారిలో కొద్ది పాటి సైడ్ ఎఫెక్ట్స్ సాధారణమే అని నిపుణులు పేర్కొంటున్నారు.
కానీ నార్వేలో ఏకంగా టీకా తీసుకుని 23 మంది మరణించడంపై ఆందోళన వ్యక్తమవుతుంది. మరో 23 మంది అస్వస్థతకు గురయ్యారు. దీంతో నార్వే ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ ఉదంతం పై విచారణకు ఆదేశించింది. మరోవైపు ఈ వాక్సిన్ తీసుకున్న వారిలో 21 మంది మహిళలు 8 మంది పురుషులు అస్వస్థతకు గురయ్యారు. వాక్సిన్ తీసుకున్న వారిలో దాదాపు అందరూ వృద్ధులే ఉండటం వల్ల ఫైజర్ వాక్సిన్ ఇకపై వయసు పైబడిన వారికి ఇవ్వకూడదని అక్కడి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
నార్వేజియన్ ఇన్స్ టి ట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కూడా ఇదే విషయాన్ని ప్రకటించింది. 80 ఏళ్ళు పైబడిన వారిలో శారీరక రుగ్మతలు, ఇతర ఆరోగ్య సమస్యలు కూడా ఉండవచ్చని అవి కూడా వారు మరణించడానికి కారణం అయ్యి ఉండవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.