logo

  BREAKING NEWS

నిమ్మగడ్డకు ఉద్యోగ సంఘాల కౌంటర్: వెంకట్రామిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!  |   అమెరికా అధ్యక్షుడి ప్రసంగాల వెనుక మన తెలుగోడి ప్రతిభ  |   ‘పంచాయతీ’ నోటిఫికేషన్ ఎఫెక్ట్: షాకిస్తున్న అధికారులు!  |   ముగిసిన 5 గంటల డెడ్ లైన్.. ఎస్ఈసీకి అధికారుల షాక్!  |   కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడికి ముహూర్తం ఫిక్స్.. కీలక ప్రకటన!  |   అయోధ్య రామ‌మందిరానికి ప‌వ‌న్ క‌ళ్యాణ్ భారీ విరాళం  |    గవర్నర్ తో నిమ్మగడ్డ భేటీ.. ఏం తెలుస్తారో?  |   చికెన్‌, కోడిగుడ్లు ఇలా తింటే డేంజ‌ర్‌.. fssai జాగ్ర‌త్త‌లు  |   తిరుపతి ఉపఎన్నిక పోరులో జనసేన అభ్యర్థి.. పవన్ క్లారిటీ!  |   బ్రేకింగ్‌: తెలంగాణ‌లో ఇక వారికి 10 శాతం రిజ‌ర్వేష‌న్లు  |  

2020లో టాప్ హీరోలు వీరే.. నెంబ‌ర్ 1గా మ‌హేష్ బాబు

త‌మ అభిమాన న‌టుల గురించి, వారి సినిమాల గురించి తెలుసుకోవ‌డం, అంద‌రికీ తెలియ‌జేయ‌డం ఫ్యాన్స్‌కు చాలా ఇష్టం. ఇందుకు ట్విట్ట‌ర్ వారికి మంచి వేదిక‌. నిత్యం ట్విట్ట‌ర్ ద్వారా త‌మ హీరోలు, హీరోల సినిమాల‌పై చ‌ర్చ‌లు జ‌రుపుతుంటారు. హ్యాష్‌ట్యాగ్స్‌ను ట్రెండ్ చేస్తారు. రికార్డులు సృష్టిస్తుంటారు. ట్విట్ట‌ర్‌లో ట్రెండింగ్‌పైన కూడా హీరోల అభిమానుల మ‌ధ్య పోటీ ఉంటుంది.

ఇటువంటి పోటీకి ఒక రిజ‌ల్ట్ చెప్పింది ట్విట్ట‌ర్‌. 2020లో ఎక్కువ‌గా ట్రెండ్ అయిన హీరోలు, హీరోయిన్లు, సినిమాల వివ‌రాల‌తో కూడిన ఒక లిస్టును ట్వీట్ట‌ర్ తాజాగా విడుద‌ల చేసింది. ఎవ‌రి గురించి ఎక్కువ ట్వీట్లు చేశారు ? ఎవ‌రిపైన ఎక్కువ‌గా ట్విట్ట‌ర్‌లో చ‌ర్చ జ‌రిగింది ? ఎవ‌రు ట్రెండింగ్‌లో ఉన్నారు ? వ‌ంటివి చూసి ఈ లిస్టును త‌యారుచేసి ప్ర‌క‌టించారు.

ముందుగా ట్విట్ట‌ర్ టాప్ 10 సౌత్ ఇండియా హీరోల లిస్టును చూస్తే తెలుగు సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు నెంబ‌ర్ 1 స్థానంలో నిలిచాడు. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ రెండో స్థానంలో ఉన్నాడు. మూడో స్థానంలో త‌మిళ హీరో విజ‌య్‌, నాలుగో స్థానంలో జూనియ‌ర్ ఎన్టీఆర్‌, ఐదో స్థానంలో త‌మిళ న‌టుడు సూర్య నిలిచారు. ఆరో స్థానంలో అల్లు అర్జున్‌, ఏడో స్థానంలో రామ్ చ‌ర‌ణ్ తేజ్‌, ఎనిమిదో స్థానంలో త‌మిళ హీరో ధ‌నుశ్‌, తొమ్మిదో స్థానంలో మాళ‌యాళ న‌టుడు మోహ‌న్‌లాల్‌, ప‌దో స్థానంలో మెగాస్టార్ చిరంజీవి ఉన్నారు. అంటే, ఈ లిస్టులో తెలుగు హీరోల హ‌వా న‌డిచింది. టాప్ 10లో ఆరుగురు తెలుగు హీరోలే ఉన్నారు.

ఇక టాప్ 10 హీరోయిన్ల సంగ‌తికి వ‌స్తే… కీర్తి సురేశ్ నెంబ‌ర్ 1 స్థానంలో నిలిచింది. కాజ‌ల్ నెంబ‌ర్ 2లో, స‌మంత నెంబ‌ర్ 3 పొజిష‌న్స్‌లో ఉన్నారు. నాలుగో స్థానంలో ర‌ష్మిక‌, ఐదో స్థానంలో పూజా హెగ్డే, ఆరో స్థానంలో తాప్సీ, ఏడో స్థానంలో త‌మ‌న్నా, ఎనిమిదో స్థానంలో ర‌కుల్ ప్రీత్ సింగ్‌, తొమ్మిదో స్థానంలో శృతి హాస‌న్‌, ప‌దో స్థానంలో త్రిష నిలిచారు.

ట్విట్ట‌ర్‌లో టాప్‌లో నిలిచిన సినిమాల లిస్టును ప‌రిశీలిస్తే… మాస్ట‌ర్ నెంబ‌ర్ 1 పొజిష‌న్‌లో ఉంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టిస్తున్న వ‌కీల్ సాబ్ నెంబ‌ర్ 2గా ఉంది. ఆ త‌ర్వాత వ‌లిమ‌యి, స‌ర్కారు వారి పాట‌, సోరారై పొట‌రు, ఆర్ఆర్ఆర్, పుష్ప‌, స‌రిలేరు నీకెవ్వ‌రు, కేజీఎఫ్ ఛాప్ట‌ర్ 2, ద‌ర్బార్ సినిమాలు ట్విట్ట‌ర్‌లో ఎక్కువ‌గా ట్వీట్లు వ‌చ్చిన టాప్ 10 లిస్టులో నిలిచాయి.

Related News