logo

  BREAKING NEWS

రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |   గుడ్‌న్యూస్‌.. క‌రోనా ముక్కు వ్యాక్సిన్ సూప‌ర్‌  |   ఈ కిట్‌తో మ‌న‌మే క‌రోనా టెస్టు చేసుకోవ‌చ్చు.. ధ‌ర ఎంతో తెలుసా ?  |  

కొంప‌ముంచిన లిఫ్ట్‌.. 20 మంది క‌రోనా వైర‌స్‌

చిన్న చిన్న నిర్ల‌క్ష్యాల వ‌ల్ల కూడా క‌రోనా బారిన ఎలా ప‌డ‌తామో చెప్పే సంఘ‌ట‌న ఖ‌మ్మంలో జ‌రిగింది. ఒక అపార్ట్‌మెంట్ లిఫ్ట్ బ‌ట‌న్ వ‌ల్ల 20 మందికి క‌రోనా వైర‌స్ సోకింది. ఇక్క‌డి బైపాస్‌ రోడ్డులోని ఓ అపార్ట్‌మెంట్‌లో కేవ‌లం 2 వారాల వ్య‌వ‌ధిలో 20 మందికి కరోనా సోకడం ఆందోళ‌న‌కు గురి చేస్తోంది. క‌రోనా సోకిన వారిలో ఒక వ్య‌క్తి హైద‌రాబాద్‌లో చికిత్స పొందుతూ మ‌ర‌ణించ‌డంతో విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి.

లిఫ్ట్ బ‌ట‌న్ వ‌ల్ల‌నే వీరికి క‌రోనా వైర‌స్ సోకింద‌ని అధికారులు సైతం భావిస్తున్నారు. అపార్ట్‌మెంట్ గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉండేవారికి ఎవ‌రికీ క‌రోనా వైర‌స్ సోక‌క‌పోవ‌డంతో లిఫ్ట్ వాడే వారికే వైర‌స్ సోకింద‌ని గుర్తించారు. అంటే క‌రోనా పాజిటీవ్ ఉన్న వ్య‌క్తి లాఫ్ట్ బ‌ట‌న్‌ను నొక్క‌డం, ఆ బ‌ట‌న్‌కు వైర‌స్ అంటుకోవ‌డం, త‌ర్వాత మ‌రికొంద‌రు అదే బ‌ట‌న్ నొక్క‌డంతో వైర‌స్ 20 మందికి వ్యాపించింద‌ని భావిస్తున్నారు.

క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో లిఫ్టుల విష‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని వైద్య నిపుణులు ఇప్ప‌టికే సూచిస్తున్నారు. లిఫ్టులో ఒక‌రికి మించి వెళ్ల‌కూడ‌దు. ఎక్కువ మంది ఒకేసారి లిఫ్ట్‌లో వెళితే సామాజిక‌దూరం పాటించే అవ‌కాశం ఉండ‌దు కాబ‌ట్టి వైర‌స్ ఒక‌రి నుంచి మ‌రొక‌రికి వ్యాపించే అవ‌కాశం ఉంటుంది. లిఫ్ట్ బ‌ట‌న్ కూడా చేతితో కాకుండా పెన్ లేదా ఏదైనా ఇత‌ర వ‌స్తువుతో నొక్కాలి. ఒక‌వేళ చేతితోనే బ‌ట‌న్ ప్రెస్ చేసినా వెంట‌నే శానిటైజ‌ర్ రాసుకోవాల‌ని వైద్యులు సూచిస్తున్నారు.

Related News