భారత్ లో కరోనా కేసులు హడలెత్తిస్తున్నాయి. గడిచిన నాలుగు రోజుల్లో దేశంలో కరోనా కేసులు రోజుకు 8 వేల చొప్పున నమోదవుతున్నాయి. కరోనా దేశంలోకి అడుగుపెట్టిన తరువాత ఇంతటి భారీ స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవ్వడం ఇదే తొలిసారి కావడం విశేషం. బుధవారం నాటికి భారత్ లో 2,07,615 కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది.
గడచిన 24 గంటల్లో 217 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. అయితే ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల్లో భారత్ 7 స్థానంలో నిలిచింది. 2 లక్షల 33 వేల కేసులతో ఇటలీ 6వ స్థానం లో ఉండగా.. లక్ష 84 వేల కేసులతో జర్మనీ 8వ స్థానంలో నిలిచింది. అయితే మన దేశంలో మే 19 నాటికి లక్ష కరోనా కేసులు ఉండగా కేవలం 15 రోజుల వ్యవధిలో రెట్టింపు సంఖ్యతో 2 లక్షలకు చేరింది.
ఈ గణాంకాలు దేశంలో కరోనా విస్తరిస్తున్న తీరుకు అద్దం పడుతుంది. మరోవైపు దేశంలో కరోనా మరణాల సంఖ్య కూడా ఆందోళన కరంగానే ఉంది. ఇతరదేశాలతో పోలిస్తే.. కోవిడ్ మరణాలు ప్రపంచవ్యాప్తంగా 6 శాతం ఉండగా భారత్ లో మాత్రం ఈ రేటు 2. 8 శాతంగా ఉండటం కొంత ఉపశమనం కలిగించే వార్త. ఇక కోవిడ్ మరణాల రేటులో 13వ స్థానంలో ఉంది.