logo

32 ఏళ్ల యువ‌తిపై 19 ఏళ్ల యువ‌కుడి అఘాయిత్యం.. ప్రేమ పేరుతో..!

ప్రేమ పేరుతో వ‌య‌స్సును సైతం మ‌రిచిపోయిన ఓ యువ‌తి మోస‌పోయిన సంఘ‌ట‌న హైద‌రాబాద్‌లో జ‌రిగింది. బాలాపూర్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని ఎర్ర‌కుంట ప్రాంతానికి చెందిన 19 ఏళ్ల యువ‌కుడు అదే ప్రాంతానికి చెందిన 32 ఏళ్ల యువ‌తిపై క‌న్నేశాడు. ఆమె వెంటప‌డి ప్రేమిస్తున్నాన‌ని మాయ‌మాట‌లు చెప్పి న‌మ్మించాడు. పెళ్లి చేసుకొని హాయిగా జీవిద్దాం అంటూ ఏమార్చాడు.

ఈ క్ర‌మంలో గ‌త కొన్ని రోజులుగా యువ‌తిపై ప‌లుమార్లు అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. దీంతో వెంట‌నే త‌న‌ను పెళ్లి చేసుకోవాల‌ని యువ‌తి అడిగింది. అప్ప‌టి నుంచి మోహం చాటేయ‌డం ప్రారంభించాడు. తాను మోస‌పోయాన‌ని గ్ర‌హించిన యువ‌తి బాలాపూర్ పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు త‌ర‌లించారు.

ఇటువంటి సంఘ‌ట‌న‌నే బాలాపూర్ స‌మీపంలోని మీర్‌పేట్‌‌లోనూ జ‌రిగింది. వినోద్ అనే 28 ఏళ్ల యువ‌కుడు మీర్‌పేట్ ప్రాంతానికి చెందిన 16 ఏళ్ల బాలిక‌కు మాయ‌మాట‌లు చెప్పి, వెంట‌ప‌డి ప్రేమిస్తున్నాన‌ని న‌మ్మించాడు. ఆమెపై అత్యాచారం చేసి త‌ప్పించుకొని తిరుగుతున్నాడు. ఈ విష‌యం తెలుసుకున్న బాలిక త‌ల్లిదండ్రులు మీర్‌పేట పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు.

Related News