logo

  BREAKING NEWS

షాకింగ్‌.. భార్య‌ల‌ను అద్దెకు ఇస్తున్నారు  |   కౌశీక్ రెడ్డికి బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఏకంగా డ‌బుల్ ప్ర‌మోష‌న్‌..!  |   తెలంగాణ బీజేపీకి జోష్‌.. త్వ‌ర‌లోనే మాజీ ఎంపీ, కాంగ్రెస్ కీల‌క నేత చేరిక‌  |   రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |  

రైలు ఎక్కిస్తామని తీసుకెళ్లి.. 16 ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్!

దేశ రాజధానిలో మరో ఘోరం వెలుగు చూసింది. రైలు ఎక్కిస్తామని తీసుకెళ్లి 16 ఏళ్ళ బాలికపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. జార్ఖండ్ కు చెందిన ఓ బాలిక ఢిల్లీలో ఓ ఇంట్లో పనిచేస్తుంది. లాక్ డౌన్ కారణంగా ఇంటికి వెళ్లలేకపోయిన ఆ బాలికను ఆ ఇంటి యజమానులే ట్రైన్ టికెట్ తీసి సొంతూరికి వెళ్ళడానికి ఏర్పాట్లు చేసారు.

ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్ కు చేరుకున్న బాలిక ఏ రైలు ఎక్కాలో తెలియక అయోమయాంలో పడిపోయింది. అటు వైపు వెతున్న యువకులకు టికెట్టు చూపించి సహాయం కోరింది. నువ్వు ఎక్కాల్సిన ట్రైను ఇది కాదని వెంటనే న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ కు వెళ్ళమని బాలికకు మాయమాటలు చెప్పారు. తాము కూడా అదే స్టేషన్ కు వెళ్తున్నామని చెప్పి కంగారు పెట్టి రైల్వే స్టేషన్ నుంచి బయటకు తీసుకెళ్లారు.

అనంతరం బాలికను బలవంతంగా తీసుకెళ్లి ఆమె నోట్లో మద్యం పోసి ముగ్గ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం బాలికను రోడ్డుపై వదిలేసి వెళ్లిపోయారు. రోడ్డుపై మత్తులో తూగుతూ నడుస్తున్న బాలికను మహిళా కానిస్టేబుల్ గమనించి ఆరా తీయగా అత్యాచారం జరిగిన విషయం తెలిపింది. బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించి చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

Related News