logo

  BREAKING NEWS

షాకింగ్‌.. భార్య‌ల‌ను అద్దెకు ఇస్తున్నారు  |   కౌశీక్ రెడ్డికి బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఏకంగా డ‌బుల్ ప్ర‌మోష‌న్‌..!  |   తెలంగాణ బీజేపీకి జోష్‌.. త్వ‌ర‌లోనే మాజీ ఎంపీ, కాంగ్రెస్ కీల‌క నేత చేరిక‌  |   రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |  

తెలంగాణ పోలీస్ అకాడమీలో కరోనా… డీఐజీ నుంచి అటెండర్ వరకు

తెలంగాణ పోలీస్ అకాడెమీలో కరోనా కలకలం రేపుతోంది. ఈ అకాడమీలో మొత్తం 1900 మంది అభ్యర్థులు శిక్షణ తీసుకుంటుండగా 124 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో అప్రమత్తమైన అధికారులు వారందరినీ ఐసోలేషన్ కు తరలించారు. అకాడమీలోకి కరోనా ఎలా వ్యాప్తి చెందింది అనే విషయం ఆరా తీయగా మొదట అకాడమీలో పని చేస్తున్న వంట మనిషికి కరోనా వచ్చినట్టు గుర్తించారు.

ఆమె ద్వారా అటెండర్ కు ఆ తర్వాత శిక్షణ పొందుతున్న 124 మందికి ఈ వైరస్ వ్యాప్తి చెందినట్టు తెలుస్తుంది. బాధితుల్లో డీఐజీ స్థాయి అధికారులు కూడా ఉండటం ఆందోళన కలిగిస్తుంది. కాగా ఇప్పుడు ఈ అధికారులు ఎవరెవరిని కలిసారనే విషయం తెలియాల్సి ఉంది. ఇక అకాడెమీలో పని చేస్తున్న వారు.మిగిలిన అభ్యర్థులందరికీ కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు.

తెలంగాణలో ఒక్కరోజులో 1087 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 13,436 కు చేరుకున్నాయి. అత్యధికంగా జీహెచ్ ఎంసీ పరిధిలోనే ఈ కేసులు వ్యాపిస్తుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే జంట నగరాల్లోని బేగం బజార్, జనరల్ బజార్ లలో వ్యాపారస్తులు దుకాణాలు మూసివేసి స్వచ్ఛందంగా బంద్ ను పాటిస్తున్నారు.

Related News