logo

  BREAKING NEWS

క‌డుపులో మంట ఎందుకొస్తుంది ? ఎలా త‌గ్గించుకోవాలి ?  |   ఇక మీ గ‌డ‌ప వ‌ద్ద‌కే బ్యాంకు వ‌స్తుంది.. కొత్త స‌ర్వీసు  |   బ్రేకింగ్‌: తెలుగుదేశం పార్టీ పార్ల‌మెంటు అధ్య‌క్షుల నియామ‌కం  |   ఆ ఛాన‌ల్ ప్రోగ్రాంకు రాక‌పోయి ఉంటే ఎస్పీ మ‌న‌తోనే ఉండేవారా..?  |   బీజేపీ జాతీయ క‌మిటీ నియామ‌కం.. న‌లుగురు తెలుగువాళ్ల‌కు చోటు  |   టీడీపీ, వైసీపీ శ్రేణుల‌ను ఉర్రూత‌లూగించిన ఆ రెండు పాట‌లు పాడింది బాలునే  |   సొంతిల్లు దానం.. స‌మాధిపై ఏం రాయాలో ముందే చెప్పిన బాలు  |   శానిటైజ‌ర్ ఎక్కువ‌గా వాడుతున్నారా..? ఈ ప్ర‌మాదాలు ఉన్నాయి జాగ్ర‌త్త‌..!  |   విషాద వార్త‌… ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం ఇక లేరు  |   తుమ్ములు ఎక్కువ‌గా వ‌స్తున్నాయా ? ఈ చిట్కా పాటిస్తే త‌గ్గిపోతాయి  |  

పాక్ నుంచి వ‌చ్చిన ఒకే కుటుంబంలో 11 మంది ఆత్మ‌హ‌త్య‌

ఒకే కుటుంబంలో 11 మంది సామూహిక ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డిన విషాద‌క‌ర సంఘ‌ట‌న రాజ‌స్థాన్‌లో చోటు చేసుకుంది. పాకిస్థాన్ బ‌త‌క‌లేక భార‌త్‌లో ఆశ్ర‌యం పొందేందుకు వ‌చ్చిన ఈ కుటుంబం అర్థంత‌రంగా త‌నువు చాలించింది. ఏం క‌ష్ట‌మొచ్చిందో కానీ ఇంట్లో చిన్నా, పెద్దా అంద‌రూ ఒకేసారి విషం తాగి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డారు. వివ‌రాళ్లోకి వెళ్తే… రాజ‌స్థాన్‌లోని దేచు పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని తోదాత గ్రామంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది.

పాకిస్థాన్‌కు చెందిన ఈ హిందూ కుటుంబం కొన్నేళ్ల క్రితం భార‌త్‌కు వ‌ల‌స‌వ‌చ్చి రాజ‌స్థాన్‌లోని తోదాత గ్రామంలో స్థిర‌ప‌డింది. అక్క‌డే స్థానికుల వ‌ద్ద నుంచి కొంత భూమిని కౌలుకు తీసుకొని వ్య‌వ‌సాయం చేస్తూ జీవిస్తున్నారు. పాక్ నుంచి వ‌చ్చినా గ్రామ‌స్థులు వీరిని ఆదుకొని అక్కున చేర్చుకున్నారు. అంత బాగుంద‌నుకుంటున్న స‌మయంలో ఈ కుటుంబం ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది.

మొత్తం 12 మంది కుటుంబ‌స‌భ్యులు విష‌యం తాగారు. వీరంతా విగ‌త జీవులుగా ప‌డి ఉండ‌టాన్ని గ్రామ‌స్తులు చూసి పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు. వారు వ‌చ్చే లోపే 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క‌రు మాత్రం ప్రాణాల‌తో కొట్టుమిట్టాడుతున్నాడు. అత‌డిని ఆసుప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. వీరు ఎందుకు ఆత్మహ‌త్య చేసుకోవాల్సి వ‌చ్చింది అనే కోణంలో పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న వ్య‌క్తి కోలుకుంటే ఆత్మ‌హ‌త్య కార‌ణాలు వెలుగులోకి వ‌స్తాయి.

Related News