logo

  BREAKING NEWS

మీ పిల్ల‌ల‌కు బండిస్తున్నారా ? జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండండి  |   ఆరియానా గ్లోరీకి బంప‌ర్ ఆఫ‌ర్‌.. మెగా హీరో సినిమాలో ల‌క్కీ ఛాన్స్  |   ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు.. ఆ నోటిఫికేషన్ రద్దు!  |   బ్రేకింగ్: తాజ్ మహల్ కు బాంబు బెదిరింపు..!  |   మున్సిప‌ల్ ఎన్నిక‌లపై సీక్రెట్ స‌ర్వే.. రిజ‌ల్ట్ చూసి షాకైన జ‌గ‌న్‌  |   బంగారం కొనేవారికి బ్యాడ్‌ న్యూస్.. పెరిగిన బంగారం ధ‌ర‌లు  |   బ్రేకింగ్: నిమ్మగడ్డ వివాదాస్పద నిర్ణయానికి హైకోర్టు బ్రేకులు.. భారీ ఎదురుదెబ్బ!  |   ఆనాడు జగన్ ను అడ్డుకున్నారు.. బాబుపై ఏపీ మంత్రి ధ్వజం  |   మంత్రి కేటీఆర్ కు సవాల్.. ఓయూ క్యాంపస్ దగ్గర ఉద్రిక్తత!  |   హైటెన్షన్: చంద్రబాబుకు షాకిచ్చిన పోలీసులు.. ఎయిర్పోర్టులో బైఠాయింపు!  |  

ప‌ద్మ‌విభూష‌ణ్‌, ప‌ద్మ‌భూష‌ణ్‌, ప‌ద్మ‌శ్రీ అవార్డుల‌తో ఎంత డ‌బ్బు ఇస్తారో తెలుసా ?

ప్ర‌తి సంవ‌త్స‌రం జ‌న‌వ‌రి 26న రిప‌బ్లిక్ డే సంద‌ర్భంగా ప‌ద్మ అవార్డుల‌ను కేంద్రం ప్ర‌క‌టిస్తుంది. వివిధ రంగాల్లో విశేష సేవ‌లు అందించిన వారిని ఎంపిక చేసి వారి సేవ‌ల‌కు త‌గిన‌ట్లుగా ప‌ద్మ‌విభూష‌ణ్‌, ప‌ద్మ‌భూష‌ణ్‌, ప‌ద్మ‌శ్రీ అవార్డులు అందిస్తారు. అయితే, మ‌న‌లో చాలా మందికి ఈ అవార్డుల గురించి చాలా విష‌యాలు తెలియ‌దు. ప‌ద్మ అవార్డుల గురించి ప్ర‌తీ భార‌తీయుడు తెలుసుకోవాల్సిన విష‌యాలు ఈ వీడియోలో చూద్దాం.

1. క‌ళ‌లు, సామాజిక సేవ‌, ప్ర‌జా జీవితం, వైద్యం, సైన్స్ ఆండ్ ఇంజ‌నీరింగ్‌, ఆధ్యాత్మికం, ఆర్కియాల‌జీ, విద్య వంటి రంగాల్లో విశేష సేవ‌లు అందించిన వారికి ఈ పుర‌స్కారాల‌ను అందిస్తారు.

2. ప్ర‌ధాని నేతృత్వంలోని ప‌ద్మ అవార్డుల క‌మిటీ ప్ర‌తీ సంవ‌త్స‌రం ఈ అవార్డుల‌కు ఎంపిక చేస్తుంది. రాష్ట్రాలు, యూనియ‌న్ టెరిట‌రీలు, కేంద్ర మంత్రిత్వ శాఖ‌ల నుంచి పంపిన ప్ర‌తిపాద‌న‌ల ఆధారంగా ఎంపిక జ‌రుగుతుంది. రాష్ట్ర‌ప‌తి ఆమోద‌ముద్ర వేసిన త‌ర్వాత ప్ర‌క‌టిస్తారు.

3. కుల‌, మ‌త‌, ప్రాంత, లింగ‌భేదాలు లేకుండా ఈ అవార్డుల‌కు ఎంపిక చేస్తారు. ప్ర‌తీ సంవ‌త్స‌రం 120 లోపు మందికి మాత్ర‌మే అవార్డుల‌ను అంద‌జేస్తారు.

4. సాధార‌ణంగా మ‌ర‌ణించిన త‌ర్వాత ఈ అవార్డుల‌ను ఇవ్వ‌రు. కానీ, ఆ సంవ‌త్స‌రం మ‌ర‌ణించిన ఎవ‌రైనా వ్య‌క్తి, ఏదైనా రంగంలో విశేష కృషి చేశాడ‌ని భావించిన‌ప్పుడు, వారిని గౌర‌వించుకోవాల‌ని అనుకున్న‌ప్పుడు మాత్ర‌మే ప‌ద్మ అవార్డును ప్ర‌క‌టిస్తారు. గాన‌గాంధ‌ర్వుడు ఎస్‌పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యంకు ఇలాగే ప్ర‌క‌టించారు.

5. ప్ర‌తి సంవ‌త్స‌రం జ‌న‌వ‌రి 26న రిప‌బ్లిక్ డే నాడు ప‌ద్మ అవార్డుల‌ను ప్ర‌క‌టిస్తారు. ఆ త‌ర్వాత మూడు, నాలుగు నెల‌ల్లో రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌లో అవార్డుల ప్ర‌ధానోత్స‌వం జ‌రుగుతుంది.

6. ప్ర‌భుత్వ రంగంలో పని చేసే వారికి ప‌ద్మ అవార్డులు ఇవ్వ‌రు. కేవ‌లం డాక్ట‌ర్లు, సైంటిస్టుల‌కు మాత్రమే ఈ మిన‌హాయింపు ఉంటుంది.

7. ప‌ద్మ అవార్డులు పొందిన వారు వారి పేరు ముందు గానీ, చివ‌ర గానీ, బుక్‌ల మీద గానీ, లెట‌ర్‌హెడ్‌ల మీద గానీ, పోస్ట‌ర్ల మీద గానీ, ఎక్క‌డా వారు ప‌ద్మ అవార్డు గ్ర‌హీత అని రాసుకోవ‌ద్దు.

8. ప‌ద్మ అవార్డుతో పాటు ఎటువంటి న‌గ‌దు బ‌హుమ‌తి కూడా ఇవ్వ‌రు. ట్రైన్లు, ఫ్లైట్ల‌లో రాయితీలు, ఇత‌ర స‌ధుపాయాలు కూడా ఏమీ ఉండ‌వు.

9. విదేశీయుల‌కు కూడా ఈ అవార్డుల‌ను ఇస్తారు. 2021లో జ‌పాన్ మాజీ ప్ర‌ధాని షింజో అబేకు ప‌ద్మ విభూష‌ణ్ పుర‌స్కారాన్ని అందించారు.

10. ప‌ద్మ పుర‌స్కారాల‌ను దుర్వినియోగం చేస్తే పుర‌స్కారాన్ని కోల్పోయేలా కూడా నిబంధ‌న‌లు ఉన్నాయి.

Related News