logo

  BREAKING NEWS

రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |   గుడ్‌న్యూస్‌.. క‌రోనా ముక్కు వ్యాక్సిన్ సూప‌ర్‌  |   ఈ కిట్‌తో మ‌న‌మే క‌రోనా టెస్టు చేసుకోవ‌చ్చు.. ధ‌ర ఎంతో తెలుసా ?  |  

హైదరాబాద్ పరిధిలో ఈ పది డివిజన్లే ‘కరోనా’ డేంజర్ జోన్లు!

శుక్రవారం సాయంత్రం నాటికి తెలంగాణలో కొత్తగా 1,278 కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్తగా 8 మంది మృత్యువాత పడ్డారు. ఇక ఈ కేసులన్నీ కలుపుకుని రాష్ట్రవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 32,224కు చేరుకుంది. అయితే కోటి మంది జనాభా గల హైదరాబాద్ పరిధిలోనే సగానికి పైగా కేసులు నమోదయ్యాయూయి.

ఢిల్లీ తబ్లీగీ జమాత్ కార్యక్రమానికి హాజరైన వారిలో నగరం నుంచి వెళ్లిన వారే ఎక్కువగా ఉండటంతో వారి ద్వారా హైదరాబాద్ పరిధిలో కరోనా వ్యాప్తి మొదలైంది. వారికి తోడు విదేశాల నుంచి వచ్చిన వారు కూడా కలవడం, కొందరు ఐసోలేషన్ నిబంధనలను సరిగా పాటించకపోవడం కారణంగా ఇప్పుడు హైదరాబాద్ లో కరోనా విలయతాండవం చేస్తుంది.

హైద్రాబాద్లోని కరోనా కేసుల సంఖ్య 24,101 గా ఉంది. 250 గా ఉంది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ పరిధిలోని ఏయే ప్రాంతంలో కరోనా కేసుల తీవ్రత అధికంగా ఉందొ తెలుసుకునేందుకు అధికారులు డివిజన్ల వారీగా సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఈ వివరాల ప్రకారం.. గ్రేటర్ పరిధిలో మొత్తం 150 డివిజన్లు ఉండగా అందులో 2 డివిజన్లలో 150 కి పైగా కరోనా కేసులు నమోదైనట్టు గుర్తించారు.

మరో 8 (సైదాబాద్, ఝాన్సీ బజార్, అత్తాపూర్, గౌలిపుర, అంబర్ పెట్, ఖైరతాబాద్, అమీర్ పెట్, బన్సీలాల్ పెట్, బేగం పెట్, సీతాఫల్) డివిజన్లలో 100 కు పైగా కేసులున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ లో ఈ పది డివిజన్లు డేంజర్ జోన్లుగా ఉన్న ప్రాంతాలు. మిగిలిన 22 డివిజన్లలో 10 ఆపైన కేసులు నమోదవుతున్నాయని గుర్తించారు. జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా కేసులు, కోలుకున్న వారు, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారు, ఇంటి వద్ద ఐసోలేషన్ లో ఉన్న వారి సమాచారాన్ని తమ వెబ్ సైట్ లో శనివారం నుంచి అందుబాటులో ఉంటుందని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు.

Related News