logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

బంగారం కొనేవారికి బ్యాడ్‌ న్యూస్.. పెరిగిన బంగారం ధ‌ర‌లు

బంగారం ధ‌ర‌లు ఇటీవ‌ల భారీగా త‌గ్గుతున్న విష‌యం తెలిసిందే. గ‌తేడాది ఆగ‌స్టు నుంచి ఇప్ప‌టికి 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధ‌ర 12,100, 24 క్యారెట్ల ధ‌ర రూ.13,200 త‌గ్గింది. గ‌త ప‌ది రోజులుగా కూడా క్ర‌మంగా బంగారం ధ‌ర‌లు త‌గ్గుతూ వ‌స్తున్నాయి. దీంతో బంగారం కొనేందుకు ఇది బెస్ట్ టైమ్ అని నిపుణులు కూడా చెబుతున్నారు. అయితే ఇవాళ అంటే మార్చ్ 4న‌ గురువారం మాత్రం బంగారం రేట్లు పెరిగాయి.

నిన్నటి వ‌ర‌కు బంగారం, వెండి ధ‌ర‌లు భారీగా త‌గ్గినా ఇవాళ మాత్రం పెర‌గ‌డం బంగారం కొనాల‌నుకునే వారిని ఇబ్బంది పెట్టే విష‌యం. హైద‌రాబాద్ మార్కెట్‌లో గురువారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.370 పెరిగింది. దీంతో ప్ర‌స్తుతం రూ.46,300 ప‌లుకుతోంది. ఇదే స‌మ‌యంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.350 పెరిగింది. దీంతో ప్ర‌స్తుతం 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.42,450కు పెరిగింది.

నిన్న బంగారం ధ‌ర‌లు భారీగా త‌గ్గిన విష‌యం తెలిసిందే. 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.950, 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.1,040 త‌గ్గింది. నిన్న భారీగా ధ‌ర త‌గ్గ‌డంతో ఇవాళ స్వ‌ల్పంగా బంగారం ధ‌ర పెరిగినా కొనుగోలుదారులు కొన‌వ‌చ్చు. హైద‌రాబాద్‌తో పాటు విశాఖ‌ప‌ట్నం, విజ‌య‌వాడ‌లోనూ బంగారం ధ‌ర‌లు ఇవే ఉన్నాయి. బంగారం ధ‌ర‌లు అనేక దేశీయ‌, అంత‌ర్జాతీయ ప‌రిస్థితుల‌కు అనుగుణంగా మారుతూ ఉంటాయి. కాబ‌ట్టి, ధ‌ర‌ల‌ను కొనేముందు మ‌ళ్లీ ప‌రిశీలించుకుంటే మంచిది.

Related News