logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

వారి కోసం ఏపీకి రానున్న సోనూసూద్..!

కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ లో వేల మంది వలస కార్మికులను స్వస్థలాలకు చేర్చడంతో నటుడు సోనూసూద్ కలియుగ కర్ణుడిగా మారిపోయాడు. అక్కడితో ఆగకుండా తనకు చేతనైన సహాయాన్ని చేస్తూ ముందుకెళ్తున్నాడు. దేశం మొత్తం సోనూసూద్ ను స్ఫూర్తిగా తీసుకుంటుంటే సోను మాత్రం ఏపీ లోని విజయనగరం జిల్లా గ్రామస్థులను చూసి స్ఫూర్తి పొందానని చెప్తున్నాడు.

జిల్లాలోని ఏఓబీలో గల గిరిశిఖర కొదమ పంచాయతీ చింతామలలోని ప్రజలు ఇటీవల తమ ఊరికి సొంతంగా రోడ్డు నిర్మించుకోవడంపై సోను సూద్ స్పందించాడు. 150 కుటుంబాలు జీవిస్తున్న ఈ గ్రామంలోని ప్రజలు సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఒడిశాలో నిర్వహించే సంతకు వెళ్లాలన్నా, ఇతర అవసరాల కోసం వెళ్లాలన్నా సబకుమరి జంక్షన్ దాటవలసి ఉంటుంది. అక్కడ వీరికి ఎలాంటి రోడ్డు మార్గం లేకపోవడంతో ఈ గ్రామస్తులు అక్కడి అధికారులకు ఎన్నో ఏళ్లుగా రోడ్డు మార్గం నిర్మించి ఇవ్వాలని మొర పెట్టుకుంటున్నారు.

వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో గ్రామంలోని వారంతా ఒక్కో కుటుంబం నుంచి రూ. 2000 వేలు చందా వేసుకుని, ఇతర సంఘాల ద్వారా మరికొంత డబ్బు కూడగట్టుకుని రోడ్డు మార్గాన్ని నిర్మించుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియా ద్వారా సోనూసూద్ కు చేరడంతో సోను దీనిపై స్పందించాడు. ‘మీరు జాతి మొత్తానికి ఆదర్శంగా నిలిచారు వెల్ డన్ హీరోస్’ అంటూ ఆ ఊరి గ్రామస్తులను ఆకాశానికెత్తాడు. తొందర్లోనే మిమ్మల్ని కలవడానికి ఏపీకి వస్తానంటూ ట్వీట్ చేసాడు.

Related News