logo

  BREAKING NEWS

RRR టీజ‌ర్ కాపీ కొట్టారా..? ప్రూఫ్స్ చూపిస్తున్న నెటిజ‌న్లు  |   ఎన్నిక‌ల్లో గెలిస్తే ఉచితంగా క‌రోనా వ్యాక్సిన్‌… బీజేపీ హామీ  |   18 నెల‌ల జైలు జీవితం.. ఒక్క మాట‌తో వైఎస్సార్‌కు రాజీనామా లేఖ‌  |   కిడ్నాప్ చేసిన గంట‌లోనే హ‌త్య చేశారు.. ఆ భ‌యంతోనే..!  |   దీక్షిత్‌ను పొట్ట‌న పెట్టుకున్న కిడ్నాప‌ర్లు  |   మ‌ళ్లీ తెర‌పైన శ్రీహ‌రి, సౌంద‌ర్య‌ను చూసే అరుదైన‌ అవ‌కాశం  |   కేసీఆర్‌తో గొడ‌వ ఎక్క‌డ మొద‌లైందో చెప్పిన కోదండ‌రాం  |   ఆర్థిక ఇబ్బందుల్లో ప్ర‌ధాని.. ఈ క‌ష్టాలు ఎవ‌రికీ రావేమో..!  |   క‌ర్నూలు మ‌హిళ‌కు దొరికిన‌ కోటి రూపా‌యల వ‌జ్రం  |   బ్రేకింగ్‌: క‌రోనా వ్యాక్సిన్‌పై ప్ర‌ధాని మోడీ కీల‌క ప్ర‌క‌ట‌న‌  |  

‘రెండు నెలలకు గ్యాస్ సిలిండర్లు నిల్వ చేసుకోండి’

భారత్ – చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి. చైనా సరిహద్దుల్లో భారీ సైన్యాన్ని మోహరించి కయ్యానికి కాలు దూస్తుంది. ఈ నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ లో రెండు నెలల పాటు గ్యాస్ సిలిండర్లను నిల్వ చేసుకోవాలంటూ చమురు మార్కెటింగ్ కంపెనీలకు అత్యవసర ఆదేశాలు అందాయి. రాష్ట్ర ఆహార, పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల విభాగం జూన్ 27 న ఈ ఆదేశాలను జారీ చేసింది.

తాజా ఆదేశాలపై రకరకాలుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. చైనాతో భారత్ యుద్దానికి సిద్ధమవుతోందా? ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే ఈ ఆదేశాలు జారీ చేసిందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కాగా ప్రభుత్వ వర్గాలు మాత్రం అలాంటిదేమీ లేదని కొట్టిపారేస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్ లో వర్షాకాలం కారణంగా కొండ చరియలు విరిగిపడుతుంటాయని అందువల్ల జాతీయ రహదారులను మూసి వేస్తారు. అందుకే అంతరాయం వాటిల్లకుండా ఇలాంటి ఆదేశాలు జారీ చేస్తుంటారని అటున్నాయి.

కాగా చైనా మాత్రం పక్కా పథకం ప్రకారమే గాల్వన్ దాడులకు పాల్పడినట్టుగా తెలుస్తుంది. యుద్ధ కాంక్షతో రగిలిపోతూ కావాలనే ఘర్షణలకు తెరతీసిందని భారత అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికీ సరిహద్దుల్లో పరిస్థితులు ఉద్రిక్తంగానే ఉన్నాయి. పాంగాంగ్‌ లేక్‌ ద్వారా చైనా ఏ క్షణమైనా మనపై విరుచుకుపడే అవకాశాలున్నాయి. చైనా కు ధీటుగా బదులివ్వడానికి భారత్ కూడా అన్ని రకాలుగా సిద్ధంగా ఉందని ఆర్మ్ వర్గాలు వెల్లడించాయి.

Related News