logo

  BREAKING NEWS

భూమా అఖిలప్రియ అరెస్టుపై కొడాలినాని సంచలన వ్యాఖ్యలు!  |   సీఎం జగన్ ఆకస్మిక ఢిల్లీ పర్యటన.. మతలబేంటి?  |   ”జీవితకాలం శిక్షపడే కేసులు స్వీకరించం”.. అఖిలప్రియకు కోర్టు భారీ షాక్!  |   బ్రేకింగ్: కన్నీళ్లు పెట్టుకున్న ఎమ్మెల్యే రోజా..!  |   మాజీ మంత్రి అఖిల ప్రియ కేసులో కొత్త మలుపు!  |   నువ్వు దేవుడివి సామీ.. 1020 మంది చిన్నారుల‌కు ప్రాణాలు పోసిన మ‌హేష్  |   ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమానుల‌ను టెన్ష‌న్ పెడుతున్న త్రివిక్ర‌మ్‌  |   తొలి టీకా పై వెనక్కి తగ్గిన ఈటెల.. కారణం ఇదే!  |   తెలుగు రాష్ట్రాల సీఎంలకు కేంద్ర మంత్రి లేఖ.. కీలక ఆదేశాలు!  |   వాక్సిన్ వికటించి 23 మంది మృతి.. మరో 23 మందికి అస్వస్థత!  |  

రిటైర్మెంట్ పై ప్రధాని భావోద్వేగ లేఖ.. ధోని రిప్లై కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే!

ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్ కు ముగింపు పలుకుతూ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తీసుకున్న నిర్ణయం కోట్లాది మంది క్రికెట్ అభిమానులను కలచివేసింది. దాదాపు 16 ఏళ్లపాటు క్రికెట్ కు ధోని సేవలను గుర్తుచేసుకుంటూ ప్రధాని నరేంద్ర మోదీ రెండు పేజీల సుదీర్ఘ లేఖను రాశారు. ఈ లేఖలో మోదీ ఎన్నో విషయాలను ప్రస్తావిస్తూ భావోద్వేగం చెందారు. మోదీ రాసిన లేఖను ధోని ట్విట్టర్ లో అభిమానులతో పంచుకున్నారు.

ఎక్కడో మారుమూల ప్రాంతం నుంచి వచ్చి దేశం గర్వించదగ్గ ఆటగాడిగా ఎదిగిన ధోనిని ప్రధాని ప్రశంసించారు. అయితే ధోని కెరీర్ ను కేవలం ఆయన సాధించిన అంకెల గణాంకాలు, గెలిచిన మ్యాచ్ ల ద్వారానే గుర్తు పెట్టుకుంటే అది అన్యాయమే అవుతుంది. మిమ్మల్ని అంచనా వేయడానికి మాటలు సరిపోవడం లేదు. వినయపూర్వకమైన రీతిలో మీరు జీవితంలో ఎదిగిన తీరును కూడా మేము గుర్తుంచుకుంటామని ప్రధాని లేఖలో తెలిపారు. మీ విజయాలు ఎంతో మంది యువకుల గుండెల్లో స్ఫూర్తిని రగిల్చాయి. 2007 టీ20 ప్రపంచ కప్పే అందుకు అసలైన ఉదాహరణ. మరీ ముఖ్యంగా 2011 ప్రపంచ కప్ ఘనత భారతీయ చరిత్రలో నిలిచి పోతుంది. మీ జీవితం కోట్లాది మంది యువతకు ప్రేమరణ కలిగించింది.

గొప్ప పాఠశాలలు, కళాశాలల్లో చదవలేదు, ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చిన వారు కాదు. కానీ తనను తాను ఉన్నత స్థాయిలో నిలబెట్టుకోగలిగిన ప్రతిభ ధోని సొంత అన్నారు. ఇంటిపేరు లేకుండానే పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు. అటు ప్రొఫెషనల్‌, ఇటు వ్యక్తిగత జీవితం రెండింటినీ ఎలా సమన్వయం చేసుకోవాలనే విషయంలోనూ యువత ధోనీని చూసి నేర్చుకోవచ్చు అని యువతరానికి మోదీ సూచించారు. టీమ్ ఇండియాకు మీరు గొప్ప కెప్టెన్. కష్టసమయాలలో మీరిచ్చిన భరోసా, మ్యాచ్ గెలిపిస్తాననే ధీమా భారత్ ఎన్నటికీ మరిచిపోదు అని అన్నారు.

మీ కేశాలంకరణతో ఎలా కనిపించినా.. గెలుపోటములను సమానంగా స్వీకరించే లక్షణం ఎంతో మందికి ఒక పాఠంలా నిలుస్తుంది. మీరు తీసుకున్న ఈ నిర్ణయం కోట్లాది మంది ప్రజలకు బాధ కలిగించినా ఇకపై మీ భవిష్యత్తు బాగుండాలి. 15 ఏళ్లుగా మీరు చేసిన కృషికి కృతజ్ఞతలు అని తెలిపారు. అలాగే ధోని ఓ మ్యాచ్ ఆడిన తర్వాత కూతురు జీవాతో మైదానంలో ఆడుకుంటున్న వీడియోను తాను చూశానని అది తనకెప్పుడు గుర్తుండిపోతుందని మోదీ పేర్కొనడం విశేషం. ఇక భారత సైన్యంలో చేరి సైనికులతో కలిసి పని చేయడం.. సైన్యంలో ధోని అందించిన సేవలు అమోఘమని మోది కొనియాడారు.

ప్రధాని రాసిన ఈ సుదీర్ఘ లేఖకు ధోని కృతజ్ఞతలు తెలిపారు. ఒక కళాకారుడు, సైనికుడు, క్రీడాకారుడు కోరుకునేది తమ కృషికి గుర్తింపు. వారి త్యాగం అందరితో గుర్తించబడుతుంది. ప్రశంసించబడుతుంది. ప్రధాని మోదీ గారూ, మీ ప్రశంసలు, శుభాకాంక్షలకు నా ధన్యవాదాలు అంటూ ధోని తెలిపారు.

Related News