సినీ విశ్లేషకులు కత్తి మహేష్ ను హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేసారు. సోషల్ మీడియాలో కత్తి మహేష్ హిందువుల ఆరాధ్య దైవం శ్రీ రాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసారు. దీంతో హిందూ సంఘాలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతని అదుపులోకి తీసుకున్నారు. మొదట విచారణ నిమిత్తం కత్తి మహేష్ ను హైద్రాబాదులోని సైబర్ క్రైమ్ కార్యాలయానికి పిలిపించారు.
విచారణ అనంతరం అతనిపై ఐపీఎస్ సెక్షన్ 153(A) కమ్యూనల్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఉస్మానియా ఆసుపత్రికి తరలించి కరోనా పరీక్షలు నిర్వహించిన అనంతరం నాంపల్లి కోర్టులో జడ్జి ముందు హాజరుపరిచారు. కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ విషయంపై అతను స్పందిస్తూ.. ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన బహుజన రచయితల సమావేశంలో రాముడిపై తాను చేసిన వ్యాఖ్యలకు గాను పోలీసులు నన్ను విచారణకు పిలిచారు.
అయితే ఫిబ్రవరి నెలలో నాపై గుండాలు తనపై చేసిన రోజు మాత్రం వారి నుంచి ఎలాంటి చర్యలు లేవు. అంటే మనకు మనిషి ప్రాణాలకంటే మతపరమైన సెంటిమెంట్లే ముఖ్యమంటూ అరెస్టుకు ముందు సోషల్ మీడియాలో పోస్టు చేసాడు. కాగా గతంలో కూడా రాముడిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన కారణంగా కత్తి మహేష్ నగర బహిష్కరణకు గురైన విషయం తెలిసిందే.