logo

  BREAKING NEWS

షాకింగ్‌.. భార్య‌ల‌ను అద్దెకు ఇస్తున్నారు  |   కౌశీక్ రెడ్డికి బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఏకంగా డ‌బుల్ ప్ర‌మోష‌న్‌..!  |   తెలంగాణ బీజేపీకి జోష్‌.. త్వ‌ర‌లోనే మాజీ ఎంపీ, కాంగ్రెస్ కీల‌క నేత చేరిక‌  |   రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |  

బ్రేకింగ్: ముఖ్యమంత్రి పదవి మార్పు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు!

తెలంగాణ ముఖ్యమంత్రి స్థానంలో మార్పు ఉంటుందని, కేటీఆర్ సీఎం కాబోతున్నారని వస్తున్న వార్తలపై ముఖమంత్రి కేసీఆర్ మొదటిసారి స్పందించారు. తెలంగాణ భవన్ లో టిఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం సందర్భంగా కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేసారు. మీడియాలో వస్తున్న వార్తలపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇలాంటి ప్రచారం ఎందుకు చేస్తున్నారని మండిపడ్డారు. తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని ఇంకో పదేళ్లు రాష్ట్రానికి నేనే సీఎం గా ఉంటానని అన్నారు. తన ఆరోగ్యం బాగాలేని రోజు నేనే చెప్తానని అన్నారు. ఈ విషయంపై పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు అనవసర ప్రచారం చేయవద్దంటూ చురకలంటించారు. పార్టీ లైన్ దాటి వ్యవహరిస్తే చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

కార్యక్రమంలో భాగంగా సీఎం మాట్లాడుతూ.. ఈనెల 12 నుంచి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించనున్నట్టుగా తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో 50 వేల సభ్యత్వాలు చేయాలని సూచించారు. నాగార్జున సాగర్‌ ఉపఎన్నికలో ఘన విజయం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. టిఆర్ఎస్ మేయర్‌ అభ్యర్థిని ఎన్నిక రోజే ప్రకటిస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు.

Related News