logo

  BREAKING NEWS

రామనాయుడుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ సీఎం జగన్!  |   మైండ్‌బ్లాక్ అయ్యే రీతిలో ”వ‌కీల్ సాబ్” రెమ్యున‌రేష‌న్‌  |   ఎమ్మెల్యేకు క‌రోనా.. ఏపీ అసెంబ్లీలో కోవిడ్ క‌ల‌వ‌రం  |   అంద‌రికీ వ్యాక్సిన్ అవ‌స‌రం లేదు… వ్యాక్సిన్ వ‌చ్చినా మాస్కులు త‌ప్ప‌వు  |   ఏపీ అసెంబ్లీ: చంద్రబాబు స్పీకర్ మధ్య మాటల యుద్ధం!  |   ప్ర‌భాస్ – ప్ర‌శాంత్ నీల్ తీసేది రీమేక్ సినిమా.. ఇంత రిస్క్ ఎందుకు..?  |   ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం.. ఎన్నికల కమిషన్ సంచలన నిర్ణయం!  |   పేద విద్యార్థులకు ఎల్ఐసీ స్కాల‌ర్‌షిప్‌లు.. పూర్తి వివ‌రాలు ఇవీ  |   బ్రేకింగ్: గ్రేటర్ లోని ఆ ప్రాంతంలో పోలింగ్ రద్దు: ఎన్నికల సంఘం  |   కేంద్రంపై రైతుల దండయాత్ర ఎందుకు? నూతన వ్యవసాయ చట్టాల్లో ఏముంది?  |  

బ్రేకింగ్: తెలంగాణలో లక్ష దాటినా కరోనా కేసులు.. మొదటి మూడు స్థానాల్లో ఉన్న జిల్లాలు ఇవే!

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు రికార్డు స్థాయిని దాటేశాయి. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ శనివారం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ గణాంకాల ప్రకారం తెలంగాణలో కరోనా కేసులు లక్ష దాటాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 2,474 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1,01,865 కు చేరింది. నిన్న ఒక్కరోజే కరోనాతో 7 మరణాలు సంభవించడంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య 744 కు చేరుకుంది.

నిన్న ఒక్కరోజే కరోనా నుంచి 1768 మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న వారి సంఖ్య 78,735 గా ఉంది. కాగా రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 77.29 శాతంగా ఉన్నట్టుగా అధికారులు పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 22,386 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా హైద్రాబాద్లోని నమోదయ్యాయి. 477కరోనా కేసులతో హైదరాబాద్ మొదటి స్థానంలో, 201 కేసులతో రంగారెడ్డి 2వ స్థానంలో నిలవగా.. నిజామాబాద్ లో 153 కేసులు నమోదయ్యాయి.

Related News