logo

  BREAKING NEWS

మీ పిల్ల‌ల‌కు బండిస్తున్నారా ? జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండండి  |   ఆరియానా గ్లోరీకి బంప‌ర్ ఆఫ‌ర్‌.. మెగా హీరో సినిమాలో ల‌క్కీ ఛాన్స్  |   ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు.. ఆ నోటిఫికేషన్ రద్దు!  |   బ్రేకింగ్: తాజ్ మహల్ కు బాంబు బెదిరింపు..!  |   మున్సిప‌ల్ ఎన్నిక‌లపై సీక్రెట్ స‌ర్వే.. రిజ‌ల్ట్ చూసి షాకైన జ‌గ‌న్‌  |   బంగారం కొనేవారికి బ్యాడ్‌ న్యూస్.. పెరిగిన బంగారం ధ‌ర‌లు  |   బ్రేకింగ్: నిమ్మగడ్డ వివాదాస్పద నిర్ణయానికి హైకోర్టు బ్రేకులు.. భారీ ఎదురుదెబ్బ!  |   ఆనాడు జగన్ ను అడ్డుకున్నారు.. బాబుపై ఏపీ మంత్రి ధ్వజం  |   మంత్రి కేటీఆర్ కు సవాల్.. ఓయూ క్యాంపస్ దగ్గర ఉద్రిక్తత!  |   హైటెన్షన్: చంద్రబాబుకు షాకిచ్చిన పోలీసులు.. ఎయిర్పోర్టులో బైఠాయింపు!  |  

బిగ్ బ్రేకింగ్: ఏపీ పంచాయతీ ఎన్నికలపై సుప్రీం కీలక తీర్పు!

ఏపీ పంచాయతీ ఎన్నికలపై సుప్రీం కోర్టు కీలక తీర్పునిచ్చింది. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ కొనసాగించాలంటూ హై కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీం ను ఆశ్రయించింది. కరోనా నేపథ్యంలో ఎన్నికలు వాయిదా వేయాలంటూ ఏపీ ప్రభుత్వంతో పాటుగా ఉద్యోగ సంఘాలు సుప్రీంలో పిటిషన్ ను దాఖలు చేసిన విషయం తెలిసిందే.

ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిక్ రిషికేష్ రాయ్ నేతృత్వంలోని బెంచ్ పంచాయతీ ఎన్నికల నిర్వహణ కొనసాగించాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. రాజ్యాంగం ప్రకారం ఎన్నికలు జరగాల్సిందే అని వాయిదా వేయడం కుదరదని వ్యాఖ్యానించింది. ఎన్నికల ప్రక్రియలో తాము కల్పించుకోలేమని స్పష్టం చేసింది.

ఏపీ ప్రభుత్వం వాదనలు వినడానికి కూడా సుప్రీం ధర్మాసనం వినిపించుకోలేదని తెలుస్తుంది. కాగా ఏపీ ప్రభుత్వంతో పాటుగా ఉద్యోగ సంఘాలపై కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఎన్నికలతో ఉద్యోగ సంఘాలకు ఏమి సంబంధం? అని కోర్టు ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రముఖ న్యాయమూర్తి ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించగా.. కరోనా వ్యాక్సినేషన్, ఎన్నికలు ఒకేసారి నిర్వహించడం సాధ్యం కాదని ఆయన కోర్టుకు తెలిపారు.

Related News