logo

  BREAKING NEWS

తొలి టీకా పై వెనక్కి తగ్గిన ఈటెల.. కారణం ఇదే!  |   తెలుగు రాష్ట్రాల సీఎంలకు కేంద్ర మంత్రి లేఖ.. కీలక ఆదేశాలు!  |   వాక్సిన్ వికటించి 23 మంది మృతి.. మరో 23 మందికి అస్వస్థత!  |   వాక్సిన్ తీసుకున్నవారిలో ఈ లక్షణాలు కనిపిస్తాయి: కేంద్రం కీలక వ్యాఖ్యలు!  |   ఇది విన్నారా..? కుంబాల గోత్రం.. ఆర్త్రా న‌క్ష‌త్రం.. జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి  |   ఏ వయసు వారికి టీకా వేస్తారు? సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?  |   జనగామకు బీజేపీ చీఫ్ బండి సంజయ్.. ఉద్రిక్త వాతావరణం  |   సీరం కీలక ప్రకటన.. కరోనా వాక్సిన్ ధర ఎంతంటే?  |   చంద్రబాబు వ్యాఖ్యల దుమారం.. భారీ షాకిచ్చిన సొంత పార్టీ నేతలు!  |   వ్యవసాయ చట్టాలపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు!  |  

కేంద్ర ప్రభుత్వం శుభవార్త.. విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్స్..!

విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త వినిపించింది. కరోనా సంక్షోభం కారణంగా విద్యా విధానాల్లో భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఎన్నడూ లేని విధంగా ఆన్ లైన్ తరగతులకు డిమాండ్ పెరిగింది. ఇప్పటికే దేశంలోని అన్ని విద్యాలయాలు తమ విద్యార్థులకు ఆన్ లైన్ తరగతుల ద్వారా పాఠాలు బోధిస్తున్నాయి. అయితే ఈ విధానం వల్ల కొంత నష్టం కూడా వాటిల్లనుంది.

భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశంలో ప్రతి ఒక్క విద్యార్ధి ఈ ఆన్ లైన్ తరగతులను అందిపుచ్చుకోలేకపోతున్నాడు. ఎందుకంటే కచ్చితంగా విద్యార్థుల వద్ద ల్యాప్ ట్యాప్ గాని స్మార్ట్ ఫోన్ గాని ఉంటేనే ఈ తరగతులు వినగలడు. ఇక భవిష్యతు అంతా ఆన్ లైన్ కోర్సులదే కావడంతో కేంద్ర ప్రభుత్వం దీనిపై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్స్, ట్యాబ్లెట్, కంప్యూటర్, మొబైల్ ఫోన్, టెలివిజన్ సెట్స్ వంటి పరికరాలను ఉచితంగా అందించడానికి రంగం సిద్ధం చేస్తుంది.

ఇందులో భాగంగా రానున్న ఐదేళ్లలో అంటే 2025-26 నాటికి దేశంలోని అన్ని కాలేజీలు, విశ్వవిద్యాలయాల్లో పేరు నమోదు చేసుకునే 40 శాతం మంది విద్యార్థులకు ఉచిత డిజిటల్ డివైజ్ లను పంపిణీ చేయనుంది. 15 వ ఫైనాన్స్ కమిషన్‌కు ఇచ్చిన ప్రజెంటేషన్‌ లో కేంద్రం తాజా ప్రకటనను చేసింది. కాగా దీనికోసం రూ.36,473 కోట్లను ఖర్చు చేయనుంది. మిగతా ఖర్చును ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు భరించవలసి ఉంటుంది.

Related News