logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

కుటుంబంలో చిచ్చు పెట్టిన ప్రేమ వ్యవహారం.. మామ, కోడలి ఆత్మహత్య

ప్రేమ వ్యవహారం ఓ నిండు కుటుంబంలో చిచ్చు పెట్టింది. ఒకే ఇంట్లో మామ, కోడలు ఆత్మహత్య చేసుకుని మరణించడంతో స్థానికంగా ఈ ఘటన విషాదం నింపింది. యాదాద్రి జిల్లా మూటకొండూరు మండల కేంద్రానికి చెందిన మారయ్యకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కొడుకు జోసెఫ్ నాలుగేళ్ళ క్రితం పెద్దపల్లి జిల్లాకు చెందిన మనసును ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.

ఈ పెళ్లి మారయ్యకు ఇష్టం లేదు. అయినా కొడుకు ఇష్టం కాదనలేక ఒప్పుకున్నాడు. మారయ్య రెండో కుమారుడు జోసెఫ్ తమ్ముడు కొంత కాలంగా కరీం నగర్ లో ఉంటున్నాడు. ఈ క్రమంలో వదిన మానస సోదరి అయిన రిచాతో ప్రేమలో పడ్డాడు. ఇంట్లో ఎలాగో ఒప్పుకోరని గ్రహించి వీరిద్దరూ గుడిలో పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చారు. దీంతో మారయ్య అగ్గిమీద గుగ్గిలం అయ్యాడు. దీనంతటికి నువ్వే కారణమంటూ వెంటనే కోడలు మానసను దూషించడం మొదలు పెట్టాడు.

నిన్ను నా కొడుకు చేసుకోవడమే ఎక్కువంటే ఇప్పుడు నీ చెల్లిని కూడా నా ఇంటికే కోడలిగా తెచ్చావంటూ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేసాడు. దీంతో మనస్థాపం చెందిన మానస మంగళవారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. తన మాటల కారణంగానే కోడలు ఆత్మహత్య చేసుకుందని భావించిన జోసెఫ్ తాను కూడా ఇంటి పక్కనున్న పాకలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వీరిద్దరి మృతితో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

Related News