logo

  BREAKING NEWS

ఆ రోజు రాత్రి 9 గంట‌ల‌కు పాక్ ప‌ని ఖ‌త‌మ‌య్యేదా ?  |   కంటిచూపు త‌గ్గుతోందా ? ఈ చిన్న చిట్కాలు పాటించండి  |   గూగుల్ విజిటింగ్ కార్డు ఇస్తోంది.. మీకు కావాలా ?  |   బీజేపీలోకి రేవంత్ రెడ్డి.. కేటీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు  |   మళ్లీ పాత పార్టీలోకే విజ‌య‌శాంతి  |   మ‌రో వైల్డ్ కార్డ్ ఎంట్రీ.. ఈసారి అంద‌రి అభిమాన సింగ‌ర్‌  |   క‌రోనా సెకండ్ వేవ్ అంటే ఏంటి ? మ‌న ద‌గ్గ‌ర ఎప్పుడు మొద‌ల‌వుతుంది ?  |   మీ ఫోన్‌లో ఈ 21 యాప్‌లు ఉన్నాయా ? ‌వెంట‌నే డిలీట్ చేసేయండి !  |   ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంత రిస్క్ ఎందుకు తీసుకుంటున్నారు ?  |   క‌రోనా ప‌రీక్ష‌ల‌కు కొత్త విధానం.. ఇక క‌రోనా టెస్టులు సులువు, చౌక‌  |  

ఐసోలేషన్ నుంచి కరోనా రోగుల పరార్.. ఆందోళనలో జిల్లా వాసులు!

సిబ్బంది కళ్లుగప్పి కోవిడ్ ఆసుపత్రి నుంచి 10 మంది కరోనా బాధితులు తప్పించుకున్నారు. ఆదిలాబాద్ రిమ్స్ కోవిడ్ ఆసుపత్రిలో జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది. తప్పించుకుని పారిపోయిన వారిలో ఆరుగురికి కరోనా నిర్దారణ కాగా మరో ఇద్దరికి కరోనా లక్షణాలు ఉన్నాయని వైద్యులు తెలిపారు. పరారైన వారిలో ఇప్పటికే ముగ్గురిని గుర్తించిన పోలీసులు మరో ఏడుగురి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

అయితే కరోనాతో రిమ్స్ ఐసోలేషన్ లో చికిత్స తీసుకుంటున్న వీరంతా ఆసుపత్రిలో తప్పుడు ఫోన్ నంబర్లు, చిరునామాలు ఇవ్వడంతో వాటి ద్వారా వీరిని గుర్తించడం కష్టంగా మారింది. వీరంతా నిన్న రాత్రి ఐసోలేషన్ నుంచి తప్పించుకుని పారిపోయినట్టుగా పోలీసులు తెలిపారు. కాగా ఈ విషయం తెలిసి ఆదిలాబాద్ ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. వీరంతా ఎక్కడకి వెళ్లారు, ఎవరెవరిని కలిసారనే విషయం గుర్తించడం అత్యంత అవసరం. లేదంటే వీరి ద్వారా జిల్లాలో మరి కొన్ని కేసులు నమోదయ్యే అవకాశం ఉంది.

అయితే రోగులు రిమ్స్ నుంచి పారిపోయేందుకు కరోనా సోకిందన్న భయమే కారణమా? లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అనే విషయం తెలియాల్సి ఉంది. కాగా ఇప్పటికే ఆదిలాబాద్ జిల్లాలో రోజుకు పదుల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతుండటం, ఇటీవల కొన్ని మారు మూల ప్రాంతాల్లో కరోనా సోకి మరణాలు సంభవించడం ప్రజల్ని మరింత భయానికి గురి చేస్తుంది.

Related News